TVS X: ఒక్కసారి చార్జ్ చేస్తే 140 కిమీ వెల్లే పవర్ఫుల్ స్కూటర్… స్టైలిష్ లుక్ తో…

ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లోకి వచ్చి చాలాకాలమే అయ్యింది. కానీ వాటిలో స్టైల్, పవర్, లుక్స్ అన్నీ ఒకేసారి చూపే స్కూటర్ చాలా అరుదు. అలాంటి అరుదైన మోడల్‌నే TVS కంపెనీ “TVS X” పేరుతో తీసుకొచ్చింది. ఇది భారతదేశంలో ఇప్పటివరకు వచ్చిన ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో అద్భుతమైనదిగా చెప్పవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ స్కూటర్ చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది. bold కలర్స్, శార్ప్ లైన్స్, LED హెడ్‌లైట్లతో చాలా అగ్రెసివ్ లుక్‌కి వస్తుంది. TVS X ని చూడగానే ఇది ఓ సాధారణ స్కూటర్ కాదని అర్థమవుతుంది. ఇది ప్రత్యేకమైన “Xleton” అనే అల్యూమినియం డై-కాస్ట్ ఫ్రేమ్‌పై రూపొందించబడింది. ఇది స్కూటర్‌కి బలం, స్థిరత, మరియు స్టైలిష్ లుక్‌ను ఇస్తుంది.

డిజైన్ మాత్రమే కాదు, పెర్ఫార్మెన్స్ విషయంలో కూడా TVS X చాలా గొప్పగా నిలుస్తుంది. ఇందులో 4.44 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ మరియు 11 kW మోటార్ ఉంది. దీని వల్ల స్కూటర్‌కి మంచి టార్క్ వస్తుంది. దీంతో TVS X 95 కిలోమీటర్ల వేగం వరకు నడుస్తుంది. సిటీ రైడింగ్‌కైనా, లాంగ్ డ్రైవ్‌కైనా ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

ఇది ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే సుమారు 140 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇది ఇప్పుడు మార్కెట్లో ఉన్న స్కూటర్లతో పోల్చితే చాలా ఎక్కువ రేంజ్. TVS కంపెనీ అందించిన స్టాండర్డ్ చార్జర్‌తో స్కూటర్‌ను 5 నుండి 6 గంటల సమయంతో ఫుల్ చార్జ్ చేయవచ్చు. అంతేకాదు, TVS స్మార్ట్ హోమ్ ఫాస్ట్ చార్జర్ ఉంటే 0 నుంచి 50 శాతం వరకు కేవలం 50 నిమిషాల్లో చార్జ్ చేయవచ్చు. ఈ ఫాస్ట్ చార్జర్ ఒక ఆప్షనల్ యాక్సెసరీగా వస్తుంది.

రైడింగ్ కంఫర్ట్ విషయంలో కూడా TVS X మార్క్‌ వేసింది. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్‌తో ఇది ఎలాంటి రోడ్లపై అయినా సాఫ్ట్ గా రైడ్ అనిపిస్తుంది. చిన్న గట్టులైనా పెద్ద గడ్డలైనా ఈ స్కూటర్‌ను ఏ మాత్రం ఇబ్బంది పెట్టవు.

ఇక విషయం ధర విషయానికి వస్తే, TVS X స్కూటర్‌ ప్రారంభ ధర రూ. 2.50 లక్షల ఎక్స్‌షోరూమ్‌ ఉంది. ఇది రెండు వేరియంట్లలో మార్కెట్లో లభిస్తోంది. ఇవి ప్రస్తుతం ప్రీమియం స్కూటర్ సెగ్మెంట్‌లో టాప్ పాజిషన్‌లో నిలుస్తున్నాయి.

ఈ స్కూటర్‌ గురించి తెలుసుకున్న తర్వాత మీరు కూడా ఒక్కసారి ట్రై చేయాలని అనిపించక మానరు. స్టైల్, రేంజ్, వేగం, కంఫర్ట్, అన్నీ ఒకేసారి కావాలంటే TVS X తప్ప మళ్లీ చూడాల్సిన అవసరం లేదు. ఇక మీరు కూడా ఫ్యూచర్ ఎలక్ట్రిక్ మోబిలిటీకి ఫస్ట్ స్టెప్ వేయాలనుకుంటే, ఈ స్కూటర్ ఖచ్చితంగా బెస్ట్ చాయిస్.

ఇంత స్టైలిష్ లుక్, 140 కిమీ రేంజ్, 95 కిమీ వేగం, హైటెక్ ఫీచర్లు ఉన్న స్కూటర్‌తో రోడ్డు మీద దూసుకెళ్లాలనిపిస్తుందా? అయితే ఆలస్యం చేయకండి… TVS X మీ కోసం వెయిటింగ్‌లో ఉంది!