ఇప్పుటి కాలంలో ప్రతి ఒక్కరూ తమ అవసరాలు తీర్చుకోవడానికి రుణాల మీద ఆధారపడుతున్నారు. కారు కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా, పెద్ద ఖర్చులు చేయాలన్నా వెంటనే బ్యాంకు దగ్గరికి వెళ్లి లోన్ తీసుకుంటున్నారు. కానీ కొంతమంది ఏకకాలంలో రెండు రుణాలు తీసుకుంటూ, తీరా repayment టైంలో తలనొప్పులు ఎదుర్కొంటున్నారు. అందుకే ముందే తెలియాలి, రెండు రుణాలు తీసుకోవాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ తప్పులు చేయొద్దు?
రెండు లోన్లు = డబ్బు భారం
ఒకే సమయంలో హోం లోన్, కారు లోన్ తీసుకుంటే నెలవారీ ఖర్చులు బాగా పెరిగిపోతాయి. ఎందుకంటే రెండు లోన్లకూ EMI లు కట్టాల్సి వస్తుంది. ఇది మన ఆర్థిక స్థితిని తలకిందులే చేస్తుంది. కానీ ఒక పక్క మంచి ప్లానింగ్ తో ముందుగానే EMI వివరాలు, ఆదాయం వివరాలు చూసుకుని లోన్ తీసుకుంటే మాత్రం ఈ సమస్యలు ఉండవు. ప్లానింగ్ తో రెండు లోన్లు తీసుకుంటే త్వరగా కట్టేసే అవకాశం కూడా ఉంటుంది.
EMI లపై ఫోకస్ పెట్టాలి
ఒకేసారి రెండు లోన్లు తీసుకుంటే, ముందు EMI లను బాగా గమనించాలి. మీ ఆదాయానికి తగ్గట్టు EMI ఉండాలని చూసుకోవాలి. రెండు లోన్లు తీసుకునే ముందు ఏ లోన్ పై వడ్డీ రేటు ఎక్కువగా ఉందో, దాన్ని తొలిగా కట్టడం మంచిది. ఎందుకంటే ఎక్కువ వడ్డీ ఉన్న లోన్ కడితే, ఆర్థికంగా తగ్గ burden ఉంటుంది. అదే చిన్న లోన్ ఉంటే, అది త్వరగా పూర్తిచేసి ఒక EMI తగ్గించుకోవచ్చు.
ఒక లోన్ పూర్తయ్యాకే మరొకటి తీసుకోవడమే మంచిది
మీ వద్ద ఇప్పటికే ఒక లోన్ ఉంటే, అది పూర్తయ్యే వరకూ కొత్త లోన్ కోసం ఆగడం మంచిది. లేదంటే కనీసం EMI పెంచి ఉన్న లోన్ ను త్వరగా కట్టేయాలి. ఉదాహరణకి, మీరు 10 లక్షల కార్ లోన్ తీసుకున్నారు అనుకుందాం. 10 శాతం వడ్డీకి 5 సంవత్సరాలు అంటే నెలకు 21,000 రూపాయలు EMI కట్టాల్సి ఉంటుంది. కానీ మీరు నెలకి మరో 5,000 రూపాయలు అదనంగా కడితే, 3 సంవత్సరాల్లోనే కారు లోన్ పూర్తవుతుంది. అప్పుడు కొత్త హోం లోన్ తీసుకోవచ్చు.
ఇంకమ్ – ఖర్చుల లెక్క తప్పొద్దు
రెండు లోన్లు తీసుకోవాలంటే, ముందే మీ నెలవారీ ఆదాయం, ఖర్చులు అన్నింటినీ జాగ్రత్తగా లెక్క వేయాలి. రెండు లోన్ల EMI కట్టిన తర్వాత మిగిలే డబ్బుతో మీ నెలలావత్య ఖర్చులు పూర్తవుతున్నాయా? అనే విషయాన్ని ముందే చెక్ చేసుకోవాలి. ఈ లెక్క తేడా అయితే తర్వాత చాలా ఇబ్బంది వస్తుంది. ఫైనాన్షియల్ ఇబ్బందులు తప్పవు.
వడ్డీ రేట్లు తెలుసుకోవడం తప్పనిసరి
హోం లోన్ కు సాధారణంగా 8 నుంచి 9 శాతం వడ్డీ ఉంటుంది. కార్ లోన్ కు 9 నుంచి 12 శాతం వరకు ఉండొచ్చు. కాబట్టి మీరు తీసుకోబోయే రెండు రుణాల వడ్డీ రేట్లు ఎంత అని ముందే కచ్చితంగా తెలుసుకోవాలి. అలాగే EMI ఎంత అవుతుంది, మొత్తం పీరియడ్ ఎంత ఉంటుంది అన్నవీ ముందే ఫిక్స్ చేసుకోవాలి.
లోన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ కూడా
ఇప్పటికే రెండు రుణాలు తీసుకుని ఉంటే, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీకు ఉన్న లోన్ల వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయా? అయితే వాటిని తక్కువ వడ్డీ రేటు ఉన్న బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేయండి. చాలా బ్యాంకులు టాప్-అప్ లోన్లు కూడా ఇస్తుంటాయి. వీటికి వడ్డీ రేటు తక్కువగా ఉండొచ్చు. కాబట్టి మీరు తీసుకున్న లోన్లపై పూర్తీ సమాచారం తీసుకోవడం చాలా ముఖ్యం.
తప్పిదాలు చేస్తే భయంకరమైన ఫలితాలు
రెండు రుణాలు తీసుకోవడం అంటే పెద్ద భాద్యత. ఒక్క తప్పు చేస్తే CIBIL స్కోర్ కూడా పడిపోతుంది. అప్పుడు ఇక భవిష్యత్తులో మరో లోన్ తీసుకోవడం కష్టమే. అందుకే ప్లానింగ్ లేకుండా, తగిన లెక్కలు లేకుండా రెండు లోన్లు తీసుకోవడం పెద్ద ప్రమాదమే. అందుకే ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి.
ఫైనల్ గా
రెండు లోన్లు అవసరమా? అయితే ముందుగా EMI, వడ్డీ రేట్లు, ఖర్చులు అన్నీ లెక్కించండి. తర్వాతే లోన్ తీసుకోండి. లేకపోతే మిగతా జీవితమంతా EMI లతోనూ, ఆర్థిక సమస్యలతోనూ గడవాల్సి వస్తుంది. ఆ మాటకొస్తే, “లోన్ తీసుకోవడం కన్నా ప్లానింగ్ మెరుగ్గా ఉండాలి.”
ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు… లేకపోతే లోన్ల బాద్యతల నిండిన జీవితం తప్పదు..