ముంబై బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ బంగారం ధర తొలిసారి పదిగ్రాములకు రూ.1,00,000 చేరింది. 22 క్యారెట్ ధర కూడా రూ.91,600కి చేరుకుంది. ఈ ధరల పెరుగుదల వెనుక అంతర్జాతీయ అంశాల ప్రభావం పెద్దది.
ట్రంప్ వ్యాఖ్యలతో బంగారం భారీగా పెరిగింది
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫెడరల్ రిజర్వ్‌పై విమర్శలు చేస్తూ, దానిని మార్చాలని ప్రకటించడంతో ఆర్థిక మార్కెట్లు హడలిపోయాయి. US డాలర్ విలువ పడిపోవడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. న్యూయార్క్‌లో ఔన్స్ బంగారం ధర $3,486.85 కి చేరింది. భారత మార్కెట్ కూడా ఈ ఒత్తిడికి లోనైంది.
ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు – బంగారం ప్రాధాన్యం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు, ద్రవ్యోల్బణ భయాలు, అమెరికా రుణ భయాలు… ఇవన్నీ కలిసి బంగారం ధరలను మరింతగా లాగుతున్నాయి. చైనా, ఇతర దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లు పెంచుతున్నాయి. ఇది ధరలకు బలం ఇస్తోంది.
Related News
ఇండియాలో బంగారం డిమాండ్ ఎలా ఉంది?
భారతదేశంలో బంగారం సంపదగా భావించబడుతుంది. 2024లో ఇండియాలో బంగారం డిమాండ్ 802.8 టన్నులకు పెరిగింది. 2023లో ఇది 761 టన్నులు. మొత్తం విలువ రూ.5.15 లక్షల కోట్లకు చేరింది. ఇది గత ఏడాదితో పోల్చితే 31 శాతం పెరుగుదల.
బంగారం తాకట్టు లోన్లకు డిమాండ్ పెరుగుతుంది
ఇప్పుడు ధరలు పెరగడంతో బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకునే వారిని ఎక్కువగా చూస్తున్నాం. డిజిటల్ యాప్‌లు, ఫిన్‌టెక్ సేవలు బంగారం లోన్లను గ్రామీణ ప్రాంతాల్లో కూడా సులభంగా అందిస్తున్నాయి. ఇది తక్షణ అవసరాలను తీర్చేందుకు బంగారం మంచి ఆప్షన్‌గా మారుతోంది.
ఇకపై బంగారం కొనకపోతే భారీ నష్టమే
బంగారం ప్రస్తుతం అత్యంత భద్రమైన పెట్టుబడి మార్గంగా నిలుస్తోంది. మార్కెట్లు పడిపోతున్నా, డాలర్ విలువ తక్కువైనా, బంగారం మాత్రం భద్రత కలిగిస్తుంది. ఇకపై ధరలు మరింత పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. కనుక ఇప్పుడే కొనకపోతే మళ్లీ ఈ స్థాయిలో కొనడం కష్టమే