ఎఫ్‌డీపై పెట్టుబడి పెడుతున్నవారికి హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్ నుంచి ఓ షాకింగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ నెల ఏప్రిల్ 19, 2025 నుంచి బ్యాంక్ ఎఫ్డీ రేట్లను కొన్ని కాలపరిమితులపై 50 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. ఇది రూ.3 కోట్లలోపు డిపాజిట్లకు వర్తించనుంది. ఈ నిర్ణయం, ఆర్‌బిఐ ఇటీవల రెపో రేటును రెండు సార్లు (ఫిబ్రవరి, ఏప్రిల్) 25 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించిన నేపథ్యంలో తీసుకుంది.
ప్రస్తుతం ఎఫ్‌డీపై కొత్త వడ్డీ రేట్లు ఎంత?
ఈ తగ్గింపు తర్వాత, హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్ సాధారణ ఖాతాదారులకు 3% నుంచి 7.10% వరకు వడ్డీ అందిస్తుంది. అదే సీనియర్ సిటిజెన్స్‌కి మాత్రం 3.5% నుంచి 7.55% వరకు వడ్డీ లభిస్తుంది. అంటే పింఛన్ జీవులకు ఇంకా కొంచెం ఎక్కువ వడ్డీ లభిస్తుంది.
ఏ కాలపరిమితులపై ఎఫెక్ట్ వచ్చింది?
15 నెలల నుంచి 18 నెలల మధ్య FDకి రేటు 7.10% నుంచి 7.05%కి తగ్గింది. ఇది 5 బేసిస్ పాయింట్ల తగ్గింపు.
18 నెలల నుంచి 21 నెలల మధ్య FDకి రేటు 7.25% నుంచి 7.05%కి వచ్చింది. ఇది 20 బేసిస్ పాయింట్ల తగ్గింపు.
21 నెలల నుంచి 2 ఏళ్ల FDకి వడ్డీ రేటు 7.00% నుంచి 6.70%కి తగ్గింది. ఇది 30 బేసిస్ పాయింట్ల తగ్గింపు.
Related News
2 ఏళ్లు 1 రోజు నుంచి 3 ఏళ్లలోపు FDకి 7.00% నుంచి 6.90%కి తగ్గింది. 3 ఏళ్లు 1 రోజు నుంచి 5 ఏళ్లలోపు FDకి వడ్డీ 7.00% నుంచి 6.75%కి తగ్గింది. అంతేకాకుండా 5 ఏళ్లు 1 రోజు నుంచి 10 ఏళ్ల FDలపై వడ్డీ రేటు 7.00% నుంచి 6.50%కి తగ్గింది. ఇది 50 బేసిస్ పాయింట్ల కటింగ్, అంటే ఇదే పెద్ద తగ్గింపు అని చెప్పాలి.
అయితే 1 ఏడాది FDపై వడ్డీ రేటు మారలేదు. సాధారణ ఖాతాదారులు ఇప్పటికీ 6.60% పొందుతారు. సీనియర్ సిటిజెన్స్‌కు ఇది 7.10%. ఇక అత్యధికంగా 7.55% వడ్డీ రేటు ఇప్పుడు సీనియర్ సిటిజెన్స్‌కు మాత్రమే, 15 నెలల నుంచి 18 నెలల మధ్య FDలు పెట్టిన వారికి వర్తిస్తుంది.
స్పెషల్ ఎడిషన్ FD ఆఫర్ ఆఫిషియల్‌గా ముగిసింది
ఇకపోతే హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్ అందిస్తున్న స్పెషల్ ఎడిషన్ FD స్కీమ్ ఏప్రిల్ 1, 2025తో ముగిసింది. దీని ద్వారా లభిస్తున్న హై వడ్డీ రేట్లు ఇకలేవు. ఈ విషయాన్ని అనేక మంది ఇప్పటికీ గుర్తించకపోవచ్చు, కానీ ఇది ముందుగానే తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి.
సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లలోనూ కట్
ఈ నెల ఏప్రిల్ 12 నుంచి సేవింగ్స్ ఖాతాల్లో కూడా వడ్డీ రేట్లు తగ్గాయి. రూ.50 లక్షలలోపు బ్యాలెన్స్ ఉన్నవారికి వడ్డీ 3.00% నుంచి 2.75%కి తగ్గించారు. రూ.50 లక్షలపై బ్యాలెన్స్ ఉంటే వడ్డీ 3.50% నుంచి 3.25%కి తగ్గింది.
ఎఫ్డీ పెట్టుబడిదారులకు హెచ్చరిక
ఇప్పటికే వడ్డీ రేట్లు తగ్గుతున్న నేపథ్యంలో దీర్ఘకాల FDలు పెట్టే ముందు తాజా రేట్లను తెలుసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా సీనియర్ సిటిజెన్స్‌కు ఇప్పుడు ఉన్న ఆఫర్‌తో తక్కువ కాల FDలు పెట్టడం ద్వారా ఎక్కువ వడ్డీ పొందవచ్చు. అలాగే, ఇప్పటికే ఉన్న FDలు మేచ్యూరిటీకి వచ్చినపుడు వాటిని రీన్యూ చేయాలా లేదా అనే నిర్ణయం తీసుకునే ముందు తాజా మార్పులను పరిశీలించాలి.
ఇకపై HDFC ఎఫ్డీలపై ఎక్కువ డిమాండ్ ఉండకపోవచ్చు. దాంతో పాటు ఇతర బ్యాంకుల రేట్లతో పోల్చుకుని అత్యుత్తమ ఎఫ్డీ ఆప్షన్ ఎంచుకోవడం అవసరం.