EPFO: ఒక్క నిమిషంలో బ్యాలెన్స్ మీ మొబైల్‌లో…

ప్రొవిడెంట్ ఫండ్ (PF) అనేది ఉద్యోగుల భవిష్యత్‌కి ఆర్థిక భద్రత కలిగించే ఒక గొప్ప సేవింగ్ స్కీం. ఇందులో ఉద్యోగి ప్రాథమిక జీతంలో ఒక నిర్ణీత శాతం PF ఖాతాలో జమవుతుంది. ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇప్పుడు చాలా మంది ఈ PF ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారు. కానీ దానికి EPFO ఆఫీస్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫోన్‌ నుంచే మీ PF డబ్బులు ఎంత ఉన్నాయో చూసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

PF బ్యాలెన్స్ తెలుసుకోవడం ఎంత సులభమో తెలుసా?

ఇప్పుడు PF బ్యాలెన్స్ తెలుసుకోవడం చాలా ఈజీ అయ్యింది. మీరు మొబైల్‌తో చెక్ చేయొచ్చు, లేదా ల్యాప్‌టాప్‌తో చేయొచ్చు. SMS పంపినా సరిపోతుంది. మిస్డ్ కాల్ చేసినా సరిపోతుంది. అంతే కాకుండా, EPFO పోర్టల్, ఉమంగ్ యాప్, మొబైల్ యాప్ ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. మీ యుఏఎన్ (UAN) నంబర్‌ ఉంటే చాలు.

Related News

EPFO వెబ్‌సైట్ ద్వారా బ్యాలెన్స్ తెలుసుకోవడం

మీరు EPFO అధికారిక వెబ్‌సైట్ ద్వారా సులభంగా బ్యాలెన్స్ చెక్ చేయవచ్చు. ముందుగా www.epfindia.gov.in అనే వెబ్‌సైట్‌కి వెళ్లాలి. అక్కడ ‘For Employees’ అనే సెక్షన్‌లోకి వెళ్లాలి. తరువాత ‘Member Passbook’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు e-passbook పేజ్‌కి వెళ్లి, మీ UAN నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.

లాగిన్ అయిన తర్వాత మీ పాస్‌బుక్ డౌన్లోడ్ చేయొచ్చు. దాంతోపాటు మీ ఖాతాలో డిపాజిట్ అయిన మొత్తం, ఇంటరెస్ట్, విత్‌డ్రా వంటి పూర్తి వివరాలు చూడొచ్చు.

EPFO మొబైల్ యాప్ ద్వారా బ్యాలెన్స్ చెక్ చేయడం

EPFO సభ్యుల కోసం ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేయొచ్చు. యాప్‌ను ఓపెన్ చేసి, మీ UAN నంబర్ మరియు పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. తర్వాత ‘View Passbook’ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. వెంటనే మీ PF బ్యాలెన్స్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.

ఇంటర్నెట్ లేకపోయినా చెక్ చేయొచ్చు

మీరు ఇంటర్నెట్ ఉపయోగించలేకపోతే కూడా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. దీని కోసం, మీ రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్ నుంచి 7738299899కి SMS పంపాలి. SMSలో టైప్ చేయాల్సింది “EPFOHO UAN HIN” లాంటి ఫార్మాట్‌లో ఉండాలి.

ఇందులో HIN అంటే హిందీ, ENG అంటే ఇంగ్లీష్, TEL అంటే తెలుగు — మీరు ఏ భాషలో సమాచారం కావాలో అది టైప్ చేయండి. కొన్ని నిమిషాల్లో మీ PF ఖాతాలో ఉన్న మొత్తం మీ ఫోన్‌కి మెసేజ్ రూపంలో వస్తుంది.

మిస్డ్ కాల్ తో PF బ్యాలెన్స్! ఇదే అసలు సింపుల్ టెక్నిక్

మరొక ఈజీ పద్ధతి — మిస్డ్ కాల్… మీ రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్ నుంచి 9966044425కి ఒక్క మిస్డ్ కాల్ చాలు. ఫోన్ ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. తరువాత మీకు ఒక SMS వస్తుంది. అందులో మీ PF బ్యాలెన్స్ వివరాలు ఉంటాయి. ఇది చాలా తక్కువ సమయంతో పూర్తవుతుంది.

ఉమాంగ్ యాప్‌తో ప్రభుత్వ సేవలన్నీ ఒక్కచోటే

ఉమాంగ్ యాప్‌ ద్వారా మీరు పీఎఫ్‌తో పాటు ఇతర ప్రభుత్వ సేవల వివరాలను కూడా పొందవచ్చు. ముందుగా ఈ యాప్‌ను ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో ‘EPFO’ అనే సెక్షన్ ఎంచుకోవాలి. అక్కడ మీ UAN నంబర్‌తో లాగిన్ అయి, ‘View Passbook’ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మీ PF ఖాతా వివరాలన్నీ స్క్రీన్ మీద చూపిస్తుంది.

పెద్దగా ఏ సమాచారం తెలియకపోయినా, ఈరోజుల్లో మన PF బ్యాలెన్స్ తెలుసుకోవడం ఒక నిమిషం వ్యవహారమే అయిపోయింది. మనం ఉద్యోగం చేస్తున్న ప్రతి నెలా డబ్బులు డిడక్ట్ అవుతుంటే, అవి ఎంత వరకు పెరిగాయో మనం తెలుసుకోవడం అవసరమే.

ఇప్పటికైనా ఆలస్యం చేయకండి. మీ UAN నంబర్ చేతిలో పెట్టుకోండి. పైన చెప్పిన ఏ పద్ధతిలో అయినా మీ బ్యాలెన్స్ తెలుసుకోండి. మీ డబ్బులు మీకు కనిపించేలా చేసుకోండి. డిజిటల్ యుగంలో ఒక్క క్లిక్‌తో డబ్బులు కనిపించాలి… లేదంటే ఎవరో వాడేసినట్టు ఫీలవ్వాలి…