రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఈ ఆదివారం (ఏప్రిల్ 20) విడుదల కానుంది. పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే అనుమతి ఉత్తర్వులు జారీ చేసింది. నోటిఫికేషన్ తర్వాత 45 రోజుల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించనున్నారు.
Related News
మెగా డీఎస్సీ -2025 పరీక్షా షెడ్యూల్
- నోటిఫికేషన్ జారీ & సమాచార బులెటిన్ ప్రచురణ :: 20.04.2025
- ఆన్ లైన్ ద్వారా ఫీజులు చెల్లింపు & అప్లికేషన్ గడువు :: 20-04-2025 నుంచి 15-05-2025 వరకు
- మాక్ టెస్ట్ (నమూనా పరీక్ష) :: 20-05-2025
- హాల్ టికెట్లు డౌన్లోడ్ :: 30.05.2025 నుండి
- పరీక్ష తేదీలు :: 06-06-2025 నుంచి 06-07-2025
- ప్రాథమిక కీ విడుదల :: అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజున ప్రాథమిక కీ విడుదల చేస్తారు.
- అభ్యంతరాల స్వీకరణ :: ప్రాథమిక కీ విడుదల తదుపరి 7 రోజులు పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు.
- తుది కీ విడుదల :: అభ్యంతరాలు స్వీకరణ గడువు ముగిసిన 7 రోజుల తర్వాత తుది కీ విడుదల చేస్తారు.
- మెరిట్ జాబితా విడుదల :: తుది కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత మెరిట్ జుబితా ప్రకటిస్తారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా భర్తీ వివరాలు
విభాగం | ఖాళీలు |
తెలుగు | 65 |
హిందీ | 78 |
ఆంగ్లం | 95 |
గణితం | 64 |
ఫిజికల్ సైన్స్ | 71 |
బయాలజికల్ సైన్స్ | 103 |
సోషల్ స్టడీస్ | 132 |
వ్యాయామ విద్య | 210 |
ఎస్జీటీ | 423 |
మొత్తం | 1,241 |
ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ భర్తీలు
- ఫిజికల్ సైన్స్: 3
- బయోలాజికల్ సైన్స్: 4
- వ్యాయామ విద్య: 1
- ఎస్జీటీ: 104
- మొత్తం: 112
ప్రత్యేక విద్య భర్తీలు
- టీజీటీ: 13
- పీఈటీ: 3
- ఎస్జీటీ: 15
- మొత్తం: 31
జోన్-2 (ఈస్ట్, వెస్ట్, కృష్ణా) భర్తీలు
- పీజీటీ: 49
- టీజీటీ: 272
- పీడీ: 3
- పీఈటీ: 24
- మొత్తం: 348
గమనిక: అభ్యర్థులు డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ (https://dse.ap.gov.in) నుండి నోటిఫికేషన్ వివరాలను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా త్వరలో ప్రారంభమవుతుంది