Budget Mobile: గేమర్స్ కి బెస్ట్ ఆప్షన్స్.. తక్కువ ధరకు బెస్ట్ ఫీలింగ్…

మీకు గేమ్స్ ఆడటం అంటే చాలా ఇష్టమా? PUBG, BGMI, COD వంటి హై గ్రాఫిక్స్ గేమ్స్ మరింత స్మూత్‌గా ఆడాలంటే బలమైన ప్రాసెసర్, పెద్ద బ్యాటరీ, మంచి డిస్‌ప్లే ఉండే ఫోన్ అవసరం. ఇలాంటి ఫోన్‌ల కోసం పెద్దగా వెతకాల్సిన పని లేదు. ఎందుకంటే ఈరోజు మేము మీకోసం అమెజాన్ లో రూ.20,000 లో లభిస్తున్న టాప్ గేమింగ్ ఫోన్ల వివరాలు తీసుకువచ్చాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ ఫోన్లు ఇప్పుడు అమెజాన్ లో ఆఫర్లు, డిస్కౌంట్ లతో అందుబాటులో ఉన్నాయి. చాలా తక్కువ ధరకే గేమింగ్ కోసం అవసరమైన అన్ని ఫీచర్లు ఇందులో లభిస్తున్నాయి. మీరు కూడా మంచి ఫోన్ కోసం వెతుకుతుంటే… ఈ లిస్టులో ఉన్న ఫోన్లను మీకు బాగా నచ్చే ఫోన్‌ను ఎంచుకుని కొనవచ్చు. ఇప్పుడు ఫోన్ల వివరాల్లోకి వెళ్దాం.

iQOO Neo 10R 5G – పవర్‌పుల్ ఫోన్, గేమింగ్‌కు బెస్ట్

iQOO నుంచి వచ్చిన ఈ ఫోన్ 2025 లో బడ్జెట్ గేమింగ్ ఫోన్‌లలో ఒక టాప్ మోడల్. దీని లుక్ చాలా స్లిమ్ & స్లీక్ గా ఉంటుంది. ముఖ్యంగా దీని లో 12GB RAM ఇచ్చారు. దీంతో ఏ గేమైనా ల్యాగ్ లేకుండా చాలా స్పీడ్‌గా ఆడవచ్చు.

Related News

ఈ ఫోన్‌కు 6400 mAh భారీ బ్యాటరీ ఇచ్చారు. దీన్ని ఒకసారి చార్జ్ చేస్తే గంటల తరబడి గేమ్స్ ఆడవచ్చు. ఇందులో ఉన్న Snapdragon 8s Gen 3 ప్రాసెసర్ గేమింగ్‌కు అదిరిపోయే స్పీడ్ ఇస్తుంది. ఈ ఫోన్ 5G సపోర్ట్‌తో వస్తోంది. దీన్ని అమెజాన్‌లో డిస్కౌంట్ ధరకు కొనవచ్చు.

Realme Narzo 80 Pro 5G – గేమింగ్‌లో స్పీడ్‌తో కూడిన బడ్జెట్ బీస్ట్

మీరు గేమింగ్‌కు బడ్జెట్ ఫోన్ చూస్తున్నారా? అయితే Realme Narzo 80 Pro 5G మీకు సరైన ఎంపిక అవుతుంది. ఈ ఫోన్‌లో Dimensity 7400 ప్రాసెసర్ ఉంది. ఇది గేమింగ్‌లో మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. మీరు PUBG, BGMI లాంటివి స్మూత్‌గా ఆడవచ్చు.

ఇది రూ.19,999 ధరకు లభిస్తోంది. ఈ ఫోన్ IP69 వాటర్‌ప్రూఫ్ ప్రొటెక్షన్ తో వస్తోంది. అంటే నీళ్లు పడ్డా ఫోన్‌కు ఎటువంటి డామేజ్ ఉండదు. దీనిలో 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ డిస్‌ప్లే ఉంది. వెలుగు ఎక్కువ ఉన్న చోట కూడా క్లియర్‌గా చూడవచ్చు. లుక్స్ పరంగా కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది.

iQOO 13 5G – హై ఎండ్ గేమింగ్ కోసం హై బడ్జెట్ మోడల్

ఇది హై రేంజ్ మోడల్ అయినా గేమింగ్‌కు పర్ఫెక్ట్ ఫోన్ కావాలి అనుకునే వారికి ఇది బెస్ట్ చాయిస్. ఈ ఫోన్‌లో Snapdragon 8 Elite ప్రాసెసర్ ఉంది. ఇది ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న పవర్‌ఫుల్ ప్రాసెసర్‌లలో ఒకటి.

ఇది కేవలం గేమింగ్ కోసమే కాదు, అల్ట్రా హై గ్రాఫిక్స్ యూజ్ చేయాల్సిన యాప్స్ కోసం కూడా పర్ఫెక్ట్. ఇందులో Q2 సూపర్ కంప్యూటింగ్ చిప్ ఉంది. ఇది గేమింగ్ అనుభవాన్ని మరో లెవెల్‌కు తీసుకెళ్తుంది. 2K రిజల్యూషన్ డిస్‌ప్లే, AI ఫీచర్లతో పాటు ప్రీమియం కెమెరా కూడా ఉంది. దీని ధర రూ.54,998. అయితే ఇది తక్కువ బడ్జెట్ గేమర్స్‌కు కాకపోయినా, హై ఎండ్ గేమింగ్ కోసం బెస్ట్ ఎంపిక.

ఇప్పుడు గేమింగ్ ఫోన్ కొనకపోతే తర్వాత ఆఫర్లు మిస్ అవుతారు

ఇప్పుడు అమెజాన్ లో ఈ ఫోన్లు మంచి డిస్కౌంట్లతో లభిస్తున్నాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే తర్వాత ఈ ధరకు రావడం కష్టం. ప్రాసెసర్, RAM, బ్యాటరీ, డిస్‌ప్లే, కెమెరా అన్నీ గేమింగ్‌కు అనువుగా ఉండేలా డిజైన్ చేశారు. వీటిలో మీ బడ్జెట్‌కు అనుగుణంగా ఉన్న ఫోన్‌ను ఎంచుకుని వెంటనే ఆర్డర్ చేయండి.

గేమింగ్ అనుభవాన్ని కొత్త స్థాయిలో ఆస్వాదించాలంటే ఇవే బెస్ట్ ఫోన్లు. ఆలస్యం చేయకుండా ఇప్పుడే అమెజాన్‌లో చెక్ చేయండి. ఒక మంచి ఫోన్ మీ చేతిలో ఉంటే గేమింగ్ లెవెల్ మారిపోతుంది.