TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ సేవలు రద్దు!?

తిరుమలకు ప్రతిరోజూ వేలాది మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తరలివస్తారు. ఈ క్రమంలో భక్తులు ప్రత్యేక భక్తితో పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే.. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ జరుగుతుందని తెలిసిందే. ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య, శ్రీ మలయప్ప స్వామి, అన్ని ఆభరణాలతో అలంకరించబడి, తిరుమాడ వీధుల్లో బంగారు గరుడపై భక్తులకు దర్శనమిస్తాడు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అయితే.. ఈ సంవత్సరం తిరుమలలో నిర్వహించనున్న పౌర్ణమి గరుడసేవ పూర్తి వివరాలతో కూడిన క్యాలెండర్‌ను టీటీడీ అధికారులు ఇటీవల విడుదల చేశారు. దీని ప్రకారం.. ఈ సంవత్సరం ఈ పండుగను మూడుసార్లు రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్యాలెండర్‌లో వాటికి సంబంధించిన తేదీలను టీటీడీ అధికారులు వెల్లడించారు.

ఈ సంవత్సరం శ్రీవారి పౌర్ణమి గరుడ సేవ వివరాలు..

Related News

ఈ సంవత్సరం, తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గరుడ వాహన సేవ పౌర్ణమి రోజులలో ఈ క్రింది తేదీలలో జరుగుతుంది.

గరుడ వాహన సేవ తేదీలు..

1.⁠ ⁠12-05-2025 (సోమవారం)
2.⁠ ⁠10-07-2025 (గురువారం)
3.⁠ ⁠09-08-2025 (శనివారం)
4.⁠ ⁠07-10-2025 (మంగళవారం)
5.⁠ ⁠05-11-2025 (బుధవారం)

గరుడ వాహన సేవ రద్దుకు తేదీలు, కారణాలు..

1.⁠ ⁠11-06-2025 (బుధవారం) – జ్యేష్టాభిషేకం (మూడవ రోజు)

2.⁠ ⁠07-09-2025 (ఆదివారం) – చంద్ర గ్రహణం

3.⁠ ⁠04-12-2025 (గురువారం) – కార్తీక దీపోత్సవం.