EPFO సభ్యులకు కేంద్ర ప్రభుత్వం మరో బంపర్ గిఫ్ట్ ఇచ్చింది. ఇప్పటివరకు Provident Fund నుండి డబ్బులు తీయాలంటే మీ యూజర్ ఖాతా నంబర్ (UAN) కు లింక్ అయిన బ్యాంక్ ఖాతాకు సంబంధించిన క్యాన్సెల్డ్ చెక్కు లేదా పాస్‌బుక్ కాపీ అప్‌లోడ్ చేయాల్సి వచ్చేది. కానీ ఇకపై ఆ అవసరం లేదు. ప్రభుత్వం ఈ నిబంధనను తొలగించింది.
ఇకపై EPFO డబ్బులు తీయాలంటే మీ బ్యాంక్ ఖాతా వివరాలను అప్‌లోడ్ చేయాల్సిన పని లేదు. చెక్కు లేదా పాస్‌బుక్ స్కాన్ చేసి అప్‌లోడ్ చేయడం, వాటిని ఎంప్లాయర్ ద్వారా వెరిఫై చేయించుకోవడం ఇక వదిలేయవచ్చు. ఉద్యోగుల భవిష్యత్ నిధుల సంస్థ (EPFO) ఈ ప్రక్రియను సులభతరం చేస్తూ కొత్త క్లెయిమ్ ప్రాసెస్‌ను తీసుకొచ్చింది.
ఈ కొత్త విధానం వల్ల పీఎఫ్ డబ్బులు తీసుకునే ప్రక్రియ మరింత వేగంగా, తక్కువ సమయంలో పూర్తవుతుంది. ఇప్పటి వరకు ఎమ్‌ప్లాయర్ ద్వారా బ్యాంక్ వివరాల అప్రూవల్ కోసం సగటున 13 రోజులు పడుతున్నాయి. ఇక ఆ ఆలస్యం లేకుండా సభ్యులు డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆధార్ ఆధారిత OTP ద్వారా మీ కొత్త ఖాతా వివరాలను కూడా అప్‌డేట్ చేసుకోవచ్చు.
Related News
ఈ మార్పు మొదట 2024 మే 28న పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. కేవలం KYC పూర్తి అయిన సభ్యులకే తొలుత అందుబాటులో ఉంచారు. అప్పటి నుంచి ఇప్పటివరకు 1.7 కోట్ల మందికి పైగా సభ్యులు లాభం పొందారు. ఇప్పుడు ఇది 8 కోట్ల మందికి విస్తరించారు. ప్రస్తుతం నెలకు EPFOకి 7.74 కోట్ల మంది సభ్యులు నిధులు జమ చేస్తున్నారు. వీరిలో 4.83 కోట్ల మంది వారి బ్యాంక్ ఖాతాలను ఇప్పటికే UANతో లింక్ చేసుకున్నారు.
ఇంతవరకు బ్యాంక్ అప్రూవల్ కోసం వేచి ఉన్న 14.95 లక్షల మంది సభ్యులకు ఇది వెంటనే ఉపయోగపడనుంది. ఇకపై మీరు మీ ఖాతా వివరాల్లో మార్పు చేయాలనుకుంటే కేవలం కొత్త ఖాతా నంబర్, IFSC కోడ్ ఇవ్వడం మరియు ఆధార్ OTP ద్వారా వెరిఫై చేయడం చాలు. ఇక మీ పీఎఫ్ డబ్బులు తీయడానికి ఎవరి సహాయం అవసరం లేదు.
ఇప్పుడే క్లెయిమ్ చేయండి – ఆలస్యమైతే డబ్బు మీ ఖాతాలోకి రావడం లేట్ అవుతుంది.