ఈ పథకం తో లక్షల మంది మహిళలు లక్షాధిపతులయ్యారు… మరి మీరూ?…

2016లో ప్రారంభమైన ప్రధాన్ మంత్రి ముద్రా యోజన (PMMY) ఎంతో మంది మహిళలు, వెనుకబడిన తరగతుల జీవితాలను పూర్తిగా మార్చేసింది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 52 కోట్లకు పైగా ముద్రా ఖాతాలు తెరుచుకున్నాయి. బ్యాంకులు ఈ ఖాతాల ద్వారా దాదాపు ₹27.5 లక్షల కోట్ల రుణాలను మంజూరు చేశాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ముద్రా యోజన ద్వారా వ్యవసాయం మినహా చిన్న, సూక్ష్మ, మధ్య తరహా వ్యాపారాలు (MSME) రుణాలను పొందవచ్చు. 2014లో ఈ రంగానికి ₹8.5 లక్షల కోట్లు మాత్రమే రుణంగా ఇచ్చారు. కానీ 2023-24 నాటికి ఈ మొత్తం మూడింతలు పెరిగి ₹27.5 లక్షల కోట్లు దాటి పోయింది. 2024–25 నాటికి ఇది ₹30 లక్షల కోట్లు దాటే అవకాశం ఉందని SBI నివేదిక చెబుతోంది.

ఈ పథకంలో మూడురకాల రుణాలు ఉంటాయి – శిశు (₹50,000 వరకు), కిశోర్ (₹50 వేల నుండి ₹5 లక్షల వరకు), తరుణ్ (₹5 లక్షల నుండి ₹10 లక్షల వరకు). ఇప్పటివరకు తెరచిన 52 కోట్ల ఖాతాల్లో 40 కోట్లు (78%) శిశు క్యాటగిరీలో ఉన్నాయి. కానీ ఇప్పుడు చాలా మంది శిశు నుంచి కిశోర్‌కి మారుతున్నారు. 2015-16లో 93% ఖాతాలు శిశువే అయితే, ఇప్పుడు అవి 51.7%కి తగ్గాయి. కిశోర్ ఖాతాలు మాత్రం 5.9% నుంచి 44.7%కి పెరిగాయి.

Related News

మహిళలే ముందంజ

ఒకప్పటి రూ.38,000 సగటు రుణం ఇప్పుడు ₹1.02 లక్షలకు పెరిగింది. ఈ పథకంలో 68% ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయి. అలాగే 11% ఖాతాలు మైనారిటీలకు సంబంధించినవే. గత 9 ఏళ్లలో మహిళలకు లభించిన సగటు రుణం సంవత్సరానికి 13% వృద్ధితో ₹62,679కు చేరింది. మహిళల ఖాతాల్లో డిపాజిట్ అయిన మొత్తం కూడా ఏడాదికి 14% వృద్ధితో ₹95,269కు పెరిగింది.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలకు ఈ పథకం దారి చూపింది. 2020లో ప్రారంభమైన ఉధ్యమ్ పోర్టల్‌లో నమోదైన MSMEsలో 20.5% మహిళలే. ఈ స్కీమ్ వల్ల అనేకమంది సొంతంగా చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి ఆదాయ మార్గాలు పెంచుకున్నారు.

OBCలకు చెందిన ఖాతాలు 28%, SCలకు 16%, STలకు 6% ఉండగా, మహిళల ఖాతాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఇవే:

బిహార్ – 4.2 కోట్లు,తమిళనాడు – 4 కోట్లు,పశ్చిమ బెంగాల్ – 3.7 కోట్లు,కర్ణాటక – 3.4 కోట్లు,మహారాష్ట్ర – 3.3 కోట్లు,ఉత్తర ప్రదేశ్ – 3 కోట్లు

మీరు కూడా ముద్రా లోన్ కోసం దరఖాస్తు చేయాలంటే

ఎస్‌బీఐ, పీఎన్‌బీ, బీవోబీ వంటి బ్యాంకుల అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి.,మీ అవసరానికి అనుగుణంగా శిశు, కిశోర్ లేదా తరుణ్ రుణాన్ని ఎంచుకోండి.,అప్లికేషన్ ఫారాన్ని ఆన్లైన్‌లో నింపండి లేదా డౌన్‌లోడ్ చేసుకోండి.,ఆధార్, పాన్, అడ్రస్ ప్రూఫ్, బిజినెస్ ప్రూఫ్, కోటేషన్లు అప్‌లోడ్ చేయండి.,ఫారాన్ని సబ్మిట్ చేసి, బ్యాంక్ వెబ్‌సైట్‌లో స్టేటస్ ట్రాక్ చేయండి.

గమనిక: కేంద్ర ప్రభుత్వం ఒక్కటే ముద్రా పోర్టల్ కలిగి లేదు. బ్యాంకుల వెబ్‌సైట్ల ద్వారానే అప్లై చేయాలి.
ఇప్పుడే దరఖాస్తు చేయండి – ఇంకాస్త ఆలస్యం అంటే ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోతారు.