రిటైర్మెంట్ తర్వాత నెలసరి ఆదాయం.. ఎక్కువ రిటర్న్స్… టాక్స్ అసలే లేదు…

రిటైర్ అయిన తర్వాత డబ్బును సేఫ్‌గా పెట్టుబడి చేయడం చాలా ముఖ్యమైన విషయం. మంచి వడ్డీ రాబడి రావాలి, ట్యాక్స్ ప్రయోజనాలు ఉండాలి, మరియు డబ్బు సురక్షితంగా ఉండాలి — ఇదే కోరిక ప్రతి రిటైర్డ్ వ్యక్తికీ ఉంటుంది. అలాంటి వారికోసం పోస్ట్ ఆఫీసు ఒక గొప్ప స్కీమ్‌ని అందిస్తోంది. దీని పేరు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS).

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ స్కీమ్ భారతదేశంలో చాలా పాపులర్. ఎందుకంటే దీన్ని కేంద్ర ప్రభుత్వం నడుపుతోంది, గనుక భద్రత మీద నమ్మకం ఉంటుంది. ఇందులో మీరు పెట్టిన డబ్బుపై ప్రస్తుతం 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. ఇది సాధారణ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే ఎక్కువ. అంతేకాదు, వడ్డీ మొత్తాన్ని మీరు త్రైమాసికంగా పొందవచ్చు, అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ మీ ఖాతాలోకి వస్తుంది.

స్కీమ్‌లో ముఖ్యమైన విషయాలు

1. పెట్టుబడి పరిమితి: ఈ స్కీమ్‌లో మీరు కనీసం రూ.1,000 నుండి మొదలు పెట్టవచ్చు. గరిష్టంగా రూ.30 లక్షలు వరకు పెట్టుబడి చేయవచ్చు. అయితే రూ.1 లక్షకంటే ఎక్కువ అమౌంట్‌ను మీరు చెక్ ద్వారా మాత్రమే డిపాజిట్ చేయాలి.

Related News

2. అర్హతలు: ఈ స్కీమ్‌లో పెట్టుబడి చేయాలంటే మీ వయస్సు 60 సంవత్సరాలు పైగా ఉండాలి. కొన్ని కేసుల్లో, ప్రభుత్వ ఉద్యోగం నుండి వెల్లిపోయిన వ్యక్తులు 55 ఏళ్లకే కూడా ఈ స్కీమ్‌లో చేరవచ్చు. అయితే సాధారణంగా ఇది పూర్తిగా రిటైర్డ్ సీనియర్ పౌరుల కోసం రూపొందించబడిన పథకం.

3. ఆదాయపన్ను మినహాయింపు: ఈ స్కీమ్‌లో పెట్టుబడి చేస్తే, మీరు సెక్షన్ 80C ప్రకారం రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. ఇది మళ్లీ ఒక అదనపు లాభం.

4. పెట్టుబడి కాలవ్యవధి: ఈ స్కీమ్‌కు 5 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. కానీ, కావాలంటే మీరు ఈ కాలాన్ని మరొక 3 సంవత్సరాలకు పొడిగించవచ్చు. అంటే మీ డబ్బు సురక్షితంగా ఉండి, ఎక్కువ కాలం పాటు వడ్డీ వస్తూనే ఉంటుంది.

ఎందుకు వెంటనే జాయిన్ కావాలి?

ఈ స్కీమ్‌పై వడ్డీ రేట్లు కాలానుగుణంగా మారవచ్చు. ప్రస్తుతం లభిస్తున్న 8.2% వడ్డీ రేటు చాలా లాభదాయకం. పైగా ఇది మార్కెట్ రిస్క్‌లకు అతీతంగా ఉండే ప్రభుత్వ పథకం కావడంతో, డబ్బు పోతుందన్న భయం ఉండదు.

కాబట్టి మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా రిటైర్ అయ్యారు అంటే వెంటనే పోస్ట్ ఆఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో చేరండి. డబ్బు సేఫ్‌గా ఉంటుంది, నెలకు వడ్డీ వస్తుంది, పైగా ట్యాక్స్ మినహాయింపు కూడా పొందొచ్చు. ఆలస్యం చేస్తే ఈ అవకాశాన్ని మిస్ అవుతారు.