సావరిన్ గోల్డ్ బాండ్స్ పై బంపర్ లాభాలు.. కానీ ఎందుకు ఆపేశారు? అసలు కారణం ఇదే…

బాండ్స్ ధర మార్కెట్ గోల్డ్ రేటుకు అనుసంధానంగా ఉంటుంది.ప్రతి సంవత్సరం 2.5% వడ్డీ (ఆరు నెలలకు ఒకసారి చెల్లింపు).8 ఏళ్లలో బాండ్స్ మేచ్యూర్ అవుతాయి – అప్పటి వరకూ ఉంటే టాక్స్ మినహాయింపు.5 ఏళ్ల తరువాత ఎప్పుడు కావాలంటే అప్పుడు రిడీమ్ చేసుకోవచ్చు.
SGB స్కీం ఎందుకు ఆపేశారు?
ఆర్థిక మంత్రిత్వ శాఖ పార్లమెంట్లో ఇచ్చిన వివరణ ప్రకారం, SGB స్కీమ్ మూతపడటానికి ప్రధాన కారణాలు:
Related News
బంగారం ధరల్లో భారీ మార్పులు.ప్రపంచ ఆర్థిక సమస్యల వల్ల ప్రభుత్వ అప్పు భారంగా మారింది.2015 నవంబర్ లో మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ – 2024 ఫిబ్రవరిలో చివరిది.చివరి బాండ్స్ 2032 ఫిబ్రవరిలో పూర్తి అవుతాయి.
ఇంతవరకు ఎంత బాండ్లు జారీ చేశారు?
మొత్తం 67 ఇన్‌స్టాల్‌మెంట్స్ జారీ చేశారు.7 ఇన్‌స్టాల్‌మెంట్స్ పూర్తి మేచ్యూరిటీకి వచ్చాయి.60 ఇన్‌స్టాల్‌మెంట్స్ ఇంకా పెండింగ్.ఈ 67 ఇన్‌స్టాల్‌మెంట్స్ ద్వారా ప్రభుత్వం ₹72,274 కోట్లు సేకరించింది.
మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌లో 148% లాభం…రెండవ ఇన్‌స్టాల్‌మెంట్ 162% రిటర్న్ ఇచ్చింది…ఇప్పటి వరకు ప్రభుత్వం ₹11,800 కోట్లు రిడెంప్షన్‌కు చెల్లించింది.అసలు ఇన్వెస్ట్ చేసిన మొత్తం ₹4,800 కోట్లు మాత్రమే… అంటే 146% ఎక్కువ చెల్లించింది…
ఇంకా ఎంత బాండ్లు పెండింగ్‌లో ఉన్నాయి?
భారత ప్రభుత్వం మొత్తం 146.96 టన్నుల బంగారానికి సమానంగా బాండ్లు జారీ చేసింది.ఇప్పటి వరకు 16.96 టన్నుల బాండ్లు రిడీమ్ అయ్యాయి.ఇంకా 130 టన్నుల బాండ్లు పెండింగ్ లో ఉన్నాయి.ప్రస్తుత బంగారం ధరల ప్రకారం వీటి విలువ ₹1.2 లక్ష కోట్లకు పైగా ఉంది.
మరి ఈ బాండ్లలో మీరు పెట్టుబడి పెట్టారా? కామెంట్స్ లో వివరించండి.