కంపెనీ గ్రాచ్యుటీని ఇవ్వకుండా ఉండటానికి కారణాలేంటి?
మీరు 5 సంవత్సరాలు పూర్తి చేసినా, మీపై ఏ తప్పిదం లేకపోయినా కంపెనీ గ్రాచ్యుటీ ఇవ్వకపోతే, మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. మొదట కంపెనీకి లీగల్ నోటీసు పంపాలి. అయినా సమస్య పరిష్కారం కాకపోతే, డిస్ట్రిక్ట్ లేబర్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. కంపెనీ తప్పు చేసినట్లు తేలితే, గ్రాచ్యుటీతో పాటు జరిమానా, వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుంది.
ఎప్పుడు కంపెనీ మీ గ్రాచ్యుటీని నిలిపివేయవచ్చు?
కంపెనీ మీ పనితీరుతో సంబంధం లేకుండా గ్రాచ్యుటీ నిలిపివేయడానికి హక్కు లేదు. కానీ మీరు ఏదైనా సంస్థకు నష్టం కలిగించేలా ప్రవర్తిస్తే, తప్పుడు పని చేస్తే లేదా సంస్థ ఆర్థికంగా నష్టపోయేలా వ్యవహరిస్తే కంపెనీ మీ గ్రాచ్యుటీని నిలిపివేయవచ్చు. అయితే, దీనికి సరైన కారణాలు, ఆధారాలు ఉండాలి.
గ్రాచ్యుటీ పూర్తిగా తీసేసే హక్కు ఉందా?
కంపెనీ మీపై తప్పుడు ఆరోపణలు మోపి, లేదా ఇతర కారణాల వల్ల మొత్తం గ్రాచ్యుటీ తీసేయలేదు. ఒకవేళ మీ వల్ల కంపెనీకి నష్టం జరిగినా, ఆ నష్టం జరిగిన మొత్తం మాత్రమే కట్ చేయగలరు. మిగిలిన గ్రాచ్యుటీ మొత్తం తప్పనిసరిగా చెల్లించాల్సిందే.
Related News
మీ హక్కులు రక్షించుకోవాలంటే ఏమి చేయాలి?
కంపెనీ మీ గ్రాచ్యుటీ ఇవ్వకపోతే, ముందుగా లీగల్ నోటీసు పంపించండి. సమస్య పరిష్కారం కాకపోతే, డిస్ట్రిక్ట్ లేబర్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయండి. మీపై తప్పుడు ఆరోపణలు ఉన్నాయా? లేకుంటే, కంపెనీ సరైన ఆధారాలు లేకుండా గ్రాచ్యుటీ నిలిపివేయలేరు. గ్రాచ్యుటీ మొత్తం పూర్తిగా కట్ చేయడానికి కంపెనీకి హక్కు లేదు
మీరు మీ హక్కులు తెలుసుకుని, అన్యాయం జరిగినప్పుడు తగిన చర్యలు తీసుకుంటే, మీ గ్రాచ్యుటీని పూర్తిగా పొందగలుగుతారు. మీ కష్టం వృధా కాకూడదంటే ఈ సమాచారం మీకు తప్పక ఉపయోగపడుతుంది.