SIP ఎలా పనిచేస్తుంది?
చిన్న మొత్తంలో పెట్టుబడి – పెద్ద మొత్తంలో లాభం. నియమితంగా పెట్టుబడి పెడితే రిస్క్ తక్కువ. పెద్ద మొత్తంలో పెట్టుబడి చేయడం కష్టమైతే, SIP లో చిన్న మొత్తం నుండి మొదలుపెట్టి పెంచుకోవచ్చు. ప్రస్తుతం SIP రూ.250 నుంచి ప్రారంభించవచ్చు. పెద్ద మొత్తంలో సంపద సృష్టించుకోవడానికి ఎలాంటి పరిమితి లేదు
రూ.2,000 SIP ఇన్వెస్ట్ చేస్తే ఎంత రాబడి?
మీరు నెలకు రూ.2,000 SIP పెట్టుబడి పెడితే, సగటు 12% రాబడి వస్తుందని అంచనా వేసుకుంటే, 35 ఏళ్లలో మీ మొత్తం ఫండ్ రూ.1 కోటి అవుతుంది. మొత్తం పెట్టుబడి: రూ.8,40,000. అందుకునే లాభం: రూ.1,01,81,662. 14% రాబడి వస్తే – మీ కోటి రూపాయల లక్ష్యం 32 ఏళ్లలోనే చేరుకుంటారు.
రూ.5,000 SIP ఇన్వెస్ట్ చేస్తే?
మీరు SIP ద్వారా నెలకు రూ.5,000 పెట్టుబడి పెడితే, 12% రాబడి ఉంటే 30 ఏళ్లలో రూ.1 కోటి ఫండ్ సొంతం చేసుకోవచ్చు. మొత్తం పెట్టుబడి: రూ.18 లక్షలు. మొత్తం లాభం: రూ.1,54,04,866. 14% రాబడి వస్తే – 25 ఏళ్లలోనే కోటీశ్వరులు కావచ్చు.
Related News
రూ.10,000 SIP ఇన్వెస్ట్ చేస్తే?
మీరు నెలకు రూ.10,000 SIP పెట్టుబడి పెడితే, 12% రాబడి ఉంటే 25 ఏళ్లలో రూ.1 కోటి అవుతుంది. మొత్తం పెట్టుబడి: రూ.30 లక్షలు. మొత్తం లాభం: రూ.1,70,02,066. 14% రాబడి వస్తే – 20 ఏళ్లలోనే కోటీశ్వరులు అవ్వొచ్చు.
ఈ అవకాశాన్ని వదులుకోకండి
SIP ద్వారా మీరు కొద్ది మొత్తాల్లో పెట్టుబడి పెడుతూ, దీర్ఘకాలంలో పెద్ద మొత్తాన్ని సాధించవచ్చు. నేటి నుండి మీ SIP మొదలుపెట్టి మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి.