నిరుద్యోగులకు సూపర్ ఛాన్స్.. రూ. 20వేల జీతంతో ప్రభుత్వ ఇంటర్నెట్ షిప్..

ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్ మిస్ అయ్యారా? టెన్షన్ పడకండి. మీ కోసం మరో అద్భుతమైన అవకాశాన్ని తీసుకువచ్చాము. కేంద్ర ప్రభుత్వ మహిళా & శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అందించే ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా ప్రభుత్వ పనితీరును దగ్గరగా చూసే అవకాశం మీకుంది. ఇది ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్’ పేరుతో మోదీ ప్రభుత్వం అమలు చేస్తోంది.

ఈ ప్రోగ్రామ్ ద్వారా మహిళలు, చిన్న పట్టణాలు మరియు గ్రామాల్లోని విద్యార్థినులకు ప్రభుత్వ విధానాలు, పథకాలు, మహిళా అభివృద్ధి గురించి అవగాహన పెరుగుతుంది. ఇంటర్న్‌షిప్ ఏడాదికి నాలుగుసార్లు అందుబాటులో ఉంటుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇంటర్న్‌షిప్‌కు సంబంధించి ముఖ్యమైన వివరాలు

ఈ స్కీమ్ ఏడాదికి 4 సార్లు నిర్వహించబడుతుంది. మెయ్-జూన్, ఆగస్టు-సెప్టెంబర్, నవంబర్-డిసెంబర్, ఫిబ్రవరి-మార్చి – ఈ నాలుగు సెషన్లలో 20 మంది విద్యార్థినులకు అవకాశం ఉంటుంది. ప్రతి ఇంటర్న్‌షిప్ 2 నెలల పాటు ఉంటుంది.

ఇంటర్న్‌షిప్ స్టైపెండ్ ఎంత?

ఈ ఇంటర్న్‌షిప్‌లో ప్రభుత్వం ప్రతి నెలా ₹20,000 స్టైపెండ్ అందిస్తుంది. ప్రోగ్రామ్ పూర్తయ్యాక సర్టిఫికేట్ కూడా అందజేస్తారు. మహిళల కోసం ప్రత్యేకంగా హాస్టల్ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు. ఇంటర్న్‌షిప్ ప్రారంభానికి రెండు రోజుల ముందు హాస్టల్ ప్రవేశం ఇచ్చి, పూర్తయిన తర్వాత రెండు రోజుల వరకు ఉండే అవకాశం ఉంటుంది. అయితే భోజన ఖర్చులు మీరే భరించాలి.

Eligibility (అర్హత) ఎవరికీ?

ఈ ప్రోగ్రామ్ మహిళల కోసం మాత్రమే. 21 నుంచి 40 సంవత్సరాల వయస్సు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. మెట్రో నగరాల్లో నివసించే మహిళలకు ఈ అవకాశం లేదు. చిన్న పట్టణాలు, గ్రామాల నుండి వచ్చేవారికి ప్రాధాన్యత ఉంటుంది. విద్యార్థినులు, మహిళా విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, టీచర్లు అప్లై చేసుకోవచ్చు

ఎలా సెలెక్ట్ అవుతారు?

అప్లికేషన్ అందుకున్న తర్వాత మంత్రిత్వ శాఖ సెలక్షన్ కమిటీ వాటిని పరిశీలిస్తుంది. అవసరమైతే యూనివర్శిటీల ఫ్యాకల్టీ, నిపుణుల అభిప్రాయాన్ని కూడా తీసుకుంటారు.

ఎప్పుడు అప్లై చేయాలి?

ఇంటర్న్‌షిప్ ప్రారంభానికి 2 నెలల ముందు అప్లికేషన్ విండో ఓపెన్ అవుతుంది. ఉదాహరణకు, ఆగస్టు-సెప్టెంబర్ సెషన్ కోసం జూన్ 1 నుండి జూన్ 10 వరకు అప్లై చేయాలి.

అప్లికేషన్ ఎలా సమర్పించాలి?

అధికారిక పోర్టల్‌ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ పేరు, రాష్ట్రం, జిల్లా, మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక, లాగిన్ చేసి అప్లికేషన్ సమర్పించాలి.

ఎవరికి అవకాశం లేదు?

ఈ స్కీమ్ లో పురుషులకు అర్హత లేదు. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, కోల్కతా, పుణే వంటి మెట్రో నగరాల్లో నివసించే మహిళలు అప్లై చేయలేరు.

మీరు గ్రామం లేదా చిన్న పట్టణంలో ఉంటే, ఇది మీ భవిష్యత్తును తీర్చిదిద్దే గోల్డెన్ ఛాన్స్. అప్లై చేసుకోండి – అవకాశాన్ని మిస్ చేసుకోకండి.