భారత్‌లో బంగారం ధరలు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త టారిఫ్ విధానాలు ప్రకటించిన తర్వాత బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం 22 క్యారెట్ బంగారం ముంబైలో ₹85,600 చేరుకుంది.
బంగారం ధర ₹1 లక్షకు చేరడానికి కేవలం ₹9,000 మాత్రమే తగ్గింది. అంటే, ప్రస్తుత స్థాయిల నుండి మరింత 10% పెరిగితే, బంగారం కొత్త రికార్డు స్థాయికి చేరుతుంది.
ట్రంప్ టారిఫ్ ప్రభావం
అమెరికా ప్రభుత్వం ఇప్పటి వరకు 5.5% ఉన్న దిగుమతి సుంకాన్ని 10%కి పెంచింది. దీనివల్ల భారత ఆభరణ వ్యాపారులు ఎక్కువ ఖర్చును భరించాల్సి వస్తుంది. అయితే, భారత్ నుండి అమెరికాకు వెళ్తున్న వస్తువులపై ప్రభావం ఉంటుందే కానీ, భారత్‌లోని బంగారం ధరలపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు.
Related News
ప్రస్తుతం ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇవీ: ఢిల్లీ – 22K ₹85,750 | 24K ₹93,530. జైపూర్ – 22K ₹85,750 | 24K ₹93,530. అహ్మదాబాద్ – 22K ₹85,650 | 24K ₹93,430. పాట్నా – 22K ₹85,650 | 24K ₹93,430. ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్కతా – 22K ₹85,600 | 24K ₹93,380.
సిల్వర్ ధరలు తగ్గుముఖం
బంగారం ధరలు పెరుగుతుండగా, వెండి ధరలు తగ్గాయి. ఒక్క రోజులోనే ₹2,000 తగ్గి, 1 కిలో వెండి ధర ₹1,03,000కి పడిపోయింది.
ప్రపంచవ్యాప్తంగా బంగారం ధర పెరుగుతోంది. గత నెలలో మాత్రమే 7% పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా బంగారం ధర $3,125 ఉంది.
ఇంకా ఎక్కువ రేటు పెరిగేలోపు మీరు బంగారం కొనాలి మరింత ఆలస్యం అయితే భారీ ధరలతో కష్టం అనిపించినా కొనక తప్పదు.