Weather: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వచ్చే 3 రోజులు వానలే వానలు!!

మరత్వాడ, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో తుఫాను ప్రసరణ ఏర్పడింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుండి విదర్భ, మరత్వాడ మధ్య మహారాష్ట్ర వరకు 0.9 కి.మీ ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతోంది. దీని కారణంగా, ఈరోజు (మంగళవారం) తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు, వడగళ్ల వానలు పడే అవకాశం ఉంది. ఏప్రిల్ 1 నుండి ప్రారంభమయ్యే రాబోయే నాలుగు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుండి నాలుగు డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

మంగళవారం, తెలంగాణలోని నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు 40 నుండి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో గంటకు 30 నుండి 40 కి.మీ వేగంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అలాగే నేడు (ఏప్రిల్ 1) నిజామాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 41.2, హనుమకొండలో 35.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న (సోమవారం) తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, భద్రాచలం, రామగుండం, హైదరాబాద్, ఖమ్మం, రామగుండం, మహబూబ్ నగర్, హైదరాబాద్, ఖమ్మం, నల్గొండలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఆదిలాబాద్..41.8 డిగ్రీలు
నిజామాబాద్..40.4 డిగ్రీలు
మెదక్..40.2 డిగ్రీలు
భద్రాచలం..39.8 డిగ్రీలు
రామగుండం..38.8 డిగ్రీలు
మహబూబ్ నగర్..38.6 డిగ్రీలు
హైదరాబాద్..38.5 డిగ్రీలు
ఖమ్మం..38.4 డిగ్రీలు
నల్లగొండ..38 డిగ్రీలు
హనుమకొండ..37.5 డిగ్రీలు

Related News

మరోవైపు.. మంగళవారం ఏపీలోని 26 మండలాల్లో వేడిగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. శ్రీకాకుళం జిల్లా-6, విజయనగరం జిల్లా-6, పార్వతీపురంమాన్యం జిల్లా-10, అల్లూరి సీతారామరాజు జిల్లా-3, తూర్పుగోదావరి కోరుకొండ మండలాల్లో వేడిగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. రేపు (బుధవారం) 28 మండలాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉంది.

గురు, శుక్రవారాల్లో రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిన్న (సోమవారం), నంద్యాల (డి) గోస్పాడులో 40.3°C, కర్నూలు (డి) కమ్మరచేడు 40.2°C, అనంతపురం (డి) నాగసముద్రం 40°C, వైఎస్ఆర్ (డి) గోటూరు 39.9°C, అనకాపల్లి (D) రావికామతం 39.7°C, మన్యం (డి) 39.7°C,జియ్యమ్మవలసలో 39.7°C నమోదయ్యాయి.