TG Govt: తెలంగాణాలో పది పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

మండుతున్న వేసవిలో రేవంత్ ప్రభుత్వం మరో శుభవార్తను ప్రకటించింది. ఈ మేరకు పదవ పరీక్షలు రాసే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే విద్యా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు ఉదయం పరీక్షలు రాయడానికి మండల కేంద్రాలకు వస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ నేపథ్యంలో వేసవి వేడి కారణంగా అక్కడక్కడ కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రభుత్వ పాఠశాల పరీక్షా కేంద్రమైతే.. అందులో ఏ విద్యార్థులు పరీక్ష రాస్తున్నా.. అందరికీ మధ్యాహ్న భోజనం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే, ఈ నెల 21న ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి. పదవ పరీక్షలు రాసే విద్యార్థులకు మధ్యాహ్న భోజనంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.