నిరుద్యోగ అభ్యర్థులకు సువర్ణ అవకాశం. భారత నావికాదళంలో అగ్నివీర్ (మెట్రిక్ రిక్రూట్), అగ్నివీర్ (SSR), అగ్నివీర్ (SSR మెడికల్) పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయబడింది. ఆసక్తిగల, అర్హత కలిగిన అభ్యర్థులు రేపటి (మార్చి 29) నుండి వచ్చే నెల 10 (ఏప్రిల్) వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అగ్నివీర్లుగా ఎంపికైన అభ్యర్థులు INS చిల్కాలో (02/2025-సెప్టెంబర్, 01/2026-ఫిబ్రవరి, 02/2026-జూలై బ్యాచ్) శిక్షణ పొందుతారు.
శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులు నాలుగు సంవత్సరాలు సేవ చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://www.joinindiannavy.gov.in/ ని సందర్శించాలి. దరఖాస్తు రుసుము రూ. 550. అగ్నివీర్ (MR) 10వ తరగతి అర్హత కలిగి ఉండాలి. అగ్నివీర్ (SSR) ఇంటర్లో గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం చదివి ఉండాలి.
అగ్నివీర్ (SSR మెడికల్) ఇంటర్లో బయాలజీ, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం చదివి ఉండాలి. ఇంటర్లో కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ (CBT), రాత పరీక్ష, శారీరక పరీక్షలు, వైద్య పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది.