CM Chandrababu : ఉచిత ఇళ్లపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

ఉచిత ఇళ్లపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన విడుదల చేశారు. రెవెన్యూ సమస్యలపై మంగళవారం కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఐదేళ్లలో అర్హులైన వారందరికీ ఉచిత ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం.. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు భూమి ఇస్తామని మరోసారి తెలియజేశారు. ఇప్పటికే ప్లాట్లు పొందిన వారికి ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఆయన చెప్పారు. దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్‌ను 10 సూత్రాల ఆధారంగా రూపొందించాలని ఆయన అన్నారు. రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామాల వారీగా ప్రణాళికలను అభివృద్ధి కోసం సిద్ధం చేయాలని ఆయన అన్నారు. గ్రామాలు, మండలాల్లో వ్యవసాయం, పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి పరిశ్రమలను స్థాపించడానికి కలెక్టర్లు చొరవ తీసుకోవాలని ఆయన అన్నారు.