TGSRTC: తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. రాములోరి తలంబ్రాలు కావాలా?..నేరుగా ఇంటికే

తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) భక్తులకు శుభవార్త చెప్పింది. శ్రీరామ నవమికి ​​భద్రాచలం సీతారామ కళ్యాణ మహోత్సవానికి మీరు వెళ్లలేకపోతున్నారా? అత్యంత పవిత్రమైన రాములోరి తలంబ్రాలు కావాలా? సరే, టీజీఎస్ ఆర్టీసీ మీకు మంచి అవకాశాన్ని అందిస్తోంది. ఇది లాజిస్టిక్స్ విభాగం ద్వారా తలంబ్రాలను మీ ఇంటికి తీసుకువస్తుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

మీరు చేయాల్సిందల్లా ఇప్పుడే బుక్ చేసుకోవడమే.. ఎందుకు ఆలస్యం? ఇప్పుడే సమీపంలోని ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాలకు వెళ్లండి. రూ.151 చెల్లించి ప్రత్యేకమైన రాములోరి తలంబ్రాలను బుక్ చేసుకోండి. ఆర్టీసీ వెబ్‌సైట్ http://tgsrtclogistics.co.inలో ఆన్‌లైన్ బుకింగ్‌తో పాటు, మీరు 040-69440069, 040- 69440000 కాల్ సెంటర్ నంబర్‌లను సంప్రదిస్తే.. కంపెనీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు భక్తుల నుండి నేరుగా ఆర్డర్‌లను స్వీకరిస్తారు. ఈ వివరాలను TGSRTC MD సజ్జనార్ మంగళవారం X వేదికగా ప్రకటించారు.