గవర్నమెంట్ ఉద్యోగులకు శుభవార్త. ప్రభుత్వం కొత్త Unified Pension Scheme (UPS)ను అమలు చేయబోతోంది. ఇది ఉద్యోగులకు లైఫ్‌టైం భద్రత కలిగించే పెన్షన్ పథకం. ఇప్పటి వరకు NPS (National Pension System)లో ఉన్న ఉద్యోగులు ఇప్పుడు UPSకి మారే అవకాశం ఉంది. ఈ కొత్త పెన్షన్ స్కీమ్ ఏప్రిల్ 1, 2025 నుండి ప్రారంభం కానుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇప్పటివరకు చాలా మంది NPSలో ఉన్నప్పటికీ, కొంత మంది పెన్షన్‌లో భద్రత లేదనే అనుమానంతో ఉన్నారు. కానీ ఇప్పుడు UPS ద్వారా ఉద్యోగులకు కనీసం ₹10,000 నెలకు పెన్షన్ అందేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా భద్రంగా ఉండే అవకాశముంది.
Unified Pension Scheme (UPS) అంటే ఏమిటి?
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పెన్షన్ పథకం
- ప్రస్తుతం NPSలో ఉన్న ఉద్యోగులు ఈ స్కీమ్‌లోకి మారవచ్చు
- ఏప్రిల్ 1, 2025 నుండి UPSకు నమోదు ప్రారంభం
- లైఫ్‌టైం పెన్షన్ లభించే విధంగా సరికొత్త మార్పులు
- కనీసంగా ₹10,000 నెలకు పెన్షన్ అందేలా గవర్నమెంట్ ప్లాన్
- ఉద్యోగి మృతి చెందినప్పుడు కుటుంబ సభ్యులకు 5% అదనపు పెన్షన్
UPS ఎవరెవరికి వర్తిస్తుంది?
- కనీసం 25 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు
- ప్రస్తుతం NPSలో ఉన్న ఉద్యోగులు ఈ స్కీమ్‌లోకి మార్చుకోవచ్చు
- రిటైర్డ్ ఉద్యోగులు కూడా UPSలోకి అప్లై చేయవచ్చు
- ఉద్యోగి మృతి చెందిన తర్వాత కుటుంబ సభ్యులకు పెన్షన్ అందేలా ప్రత్యేక అవకాశం
UPSకు ఎలా అప్లై చేయాలి?
ఈ పెన్షన్ పథకానికి మీరు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
Related News
ఆన్లైన్ ప్రక్రియ:
- Protean CRA పోర్టల్ (https://npscra.nsdl.co.in) ద్వారా నమోదు చేసుకోవచ్చు
- వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి అవసరమైన ఫారములు అప్లోడ్ చేయాలి
- డిజిటల్ సిగ్నేచర్ లేదా OTP ద్వారా ధృవీకరణ చేయాలి
ఆఫ్‌లైన్ ప్రక్రియ:
- మీ శాఖా కార్యాలయానికి వెళ్లి సంబంధిత ఫారములు తీసుకోవాలి
- డ్రాయింగ్ & డిస్బర్సింగ్ ఆఫీసర్ (DDO) ద్వారా దరఖాస్తు సమర్పించాలి
- అవసరమైన డాక్యుమెంట్స్ అటాచ్ చేసి సబ్మిట్ చేయాలి
UPS దరఖాస్తులో ఏ ఫారం అవసరం?
- ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు: Form A2
- కొత్తగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరినవారు: Form A1
- రిటైర్డ్ ఉద్యోగులు: Form B2
- ఉద్యోగి మృతి చెందిన తర్వాత కుటుంబ సభ్యులు పెన్షన్ పొందాలంటే: Form 6
UPSను తప్పకుండా ఎందుకు అప్లై చేయాలి?
- దీన్ని మిస్ అయితే భవిష్యత్తులో లైఫ్‌టైం పెన్షన్ లేనట్లే
- కనీసం ₹10,000 పెన్షన్ ప్రతి నెల వస్తుంది.
- NPS కంటే మెరుగైన ఆప్షన్ – భవిష్యత్తు సురక్షితం.
- ముందుగా చెల్లించిన మొత్తానికి తగ్గట్టు లైఫ్‌టైం పెన్షన్ పొందే అవకాశం
- సెక్యూర్డ్ ఫ్యూచర్ కోసం మంచి స్కీమ్ – మీకు మీ కుటుంబానికి భద్రత
అప్లై చేయడానికి ఆలస్యం చేయొద్దు. ఏప్రిల్ 1 నుండి రిజిస్ట్రేషన్ ప్రారంభం. ఇప్పుడే అప్లై చేయండి, భవిష్యత్తులో ఆర్థికంగా భద్రంగా ఉండండి.