ఏప్రిల్ 1 నుంచి కొత్త పెన్షన్ స్కీమ్ – మిస్ అవ్వకండి.. ముఖ్యమైన మార్పులు ఇవే..

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) తాజాగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) పై కొత్త నిబంధనలు విడుదల చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ స్కీమ్ ప్రస్తుతం నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) కింద ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐచ్ఛికంగా లభ్యం కానుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

UPS గురించి ముఖ్యమైన విషయాలు:

  1. NPS కింద ఉన్న ఉద్యోగులకు కొత్త ఛాన్స్
    ప్రస్తుతం NPS కింద ఉన్న ప్రస్తుతం పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ కొత్త పెన్షన్ స్కీమ్‌ను ఎంపిక చేసుకోవచ్చు.
  2. యూపీఎస్‌లో చేరేందుకు అర్హులు ఎవరు?
    1. ఏప్రిల్ 1, 2025 నాటికి సేవలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు (NPS కింద ఉన్నవారు)
    2. ఏప్రిల్ 1, 2025 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన కొత్త రిక్రూట్లు
    3. NPS కింద ఉన్న కానీ మార్చి 31, 2025లోగా రిటైర్ అయినవారు, స్వచ్ఛందంగా రిటైర్మెంట్ తీసుకున్న వారు లేదా ప్రభుత్వ నియమావళి 56(j) కింద తొలగింపుకు గురైనవారు
  3. రిటైర్మెంట్ తర్వాత ఎంపిక చేసుకోకపోతే?
    ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత లేదా అకాల మరణం చెందిన తర్వాత UPS ఎంపిక చేసుకోకపోతే, ఆయన/ఆమె జీవిత భాగస్వామి (స్పౌస్) UPSని ఎంపిక చేసుకోవచ్చు.
  4. ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నవారు UPS ఎప్పటి వరకు ఎంపిక చేసుకోవచ్చు?
    ఏప్రిల్ 1 నుండి జూన్ 30, 2025 వరకు ప్రభుత్వ ఉద్యోగులు UPS కోసం దరఖాస్తు చేసుకోవాలి.
  5. కొత్తగా ఉద్యోగంలో చేరే వారు UPS ఎప్పటి లోపు ఎంపిక చేసుకోవాలి?
    ఏప్రిల్ 1, 2025 తర్వాత కొత్తగా జాబ్‌లో జాయిన్ అయ్యే వారు, ఉద్యోగంలో చేరిన 30 రోజుల్లో UPSను ఎంపిక చేసుకోవాలి.

మీరు UPS ఎంపిక చేసుకోవాలా?

ఈ కొత్త స్కీమ్‌తో రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ భద్రత పెరుగుతుంది. కనుక NPS కింద ఉన్న ఉద్యోగులు తప్పక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడే వివరాలను తెలుసుకొని నిర్ణయం తీసుకోండి.