మహిళలకు కానుకలు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. చాలా పరిస్థితులలో ఇంట్లో ఉన్న మహిళలకు బహుమతులు ఇవ్వాల్సి వస్తుంది. ఎప్పుడు ఒకే రకమైన బహుమతులు ఇస్తూ ఉంటే బోర్ అనిపిస్తుంది.
ఆర్థిక పరమైన కానుకలు అంటే ఇష్టపడే మహిళలకు అలాంటి ఒక కానుక గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్:
ఈ స్కీమ్ 2023లో ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రారంభించింది. ఇది మహిళలు ఆదా చేయడాన్ని ప్రోత్సహించి, వారి ఆర్థిక భద్రతను పెంపొందించేందుకు రూపొందించబడింది.
మూడు లక్షల వరకు పెట్టుబడి:
మీరు ఈ స్కీమ్‌లో ₹2,00,000 వరకు పెట్టుబడులు పెట్టవచ్చు.
పెట్టుబడులు ఎప్పుడు చేయాలి?
– ఈ స్కీమ్‌లో పెట్టుబడులు పెట్టడానికి గడువు 31 మార్చి 2025 వరకు ఉంది. మీరు బ్యాంకు లేదా పోస్టాఫీసు ద్వారా పెట్టుబడులు పెట్టవచ్చు.
ఇంటరెస్ట్ రేటు ఎంత?
– ఈ స్కీమ్‌లో ప్రస్తుతం 7.5% వడ్డీ రేటు ఉంది. 2 సంవత్సరాల్లో మీ పెట్టుబడికి మంచి లాభం వస్తుంది.
₹1,00,000 పెట్టుబడికి ఎంత లాభం వస్తుంది?
– మీరు ₹1,00,000 పెట్టుబడిని మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్‌లో పెట్టుకుంటే, 2 సంవత్సరాల్లో ₹16,022 వడ్డీ వచ్చి మొత్తం ₹1,16,022 అవుతుంది.
ఎవరెవరికి ఈ అర్హత ఉంది?
– ఈ స్కీమ్ మహిళలు మరియు చిన్నారులకు మాత్రమే అందుబాటులో ఉంది. భారతదేశం లోని మహిళలు ఈ స్కీమ్‌లో పాల్గొనవచ్చు. పురుషులు కూడా తమ భార్య, అమ్మ లేదా సోదరి పేరులో పెట్టుబడులు పెట్టవచ్చు.
గడువు చివరి తేదీ
– ఈ స్కీమ్ లో పెట్టుబడులు పెట్టడానికి చివరి గడువు 31 మార్చి 2025. అది వరకు మీరు రిజిస్టర్ చేసుకోవాలి.
అందుకే ఈ అవకాశాన్ని మిస్ చేయకండి. మీ ఇంట్లో ఉన్న మహిళలకు ఒక ప్రత్యేకమైన అవసరమైన బహుమతిని ఒక బాధ్యతగా ఇవ్వండి. వారిని సంతోష పెట్టండి.