8వ పే కమిషన్ ఎప్పుడు అమలవుతుంది? ప్రతి ఉద్యోగి సమాధానం కోసం ఎదురు చూస్తున్న ప్రశ్న. 8వ పే కమిషన్ గురించి ఎన్నో అప్డేట్స్ వస్తున్నా ఇంకా తేదీ ప్రకటించనందున అందరూ ఉద్యోగులలో కమిషన్ రిపోర్ట్ ఎప్పుడు విడుదల చేస్తారు అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు..
7వ పే కమిషన్ గడువు 2025 డిసెంబర్ 31 తో ముగియనుంది. కానీ, 8వ పే కమిషన్ అమలు తేదీ ఇంకా నిర్ణయించలేదు.
8వ పే కమిషన్ గురించి పూర్తి వివరాలు:
- ఏప్రిల్ 2025 లో ప్రభుత్వం 8వ పే కమిషన్ ఏర్పాటును ప్రకటించొచ్చు.
- కమిషన్ లో ఒక ఛైర్మన్, ఇద్దరు సభ్యులు ఉంటారు.
- కమిషన్ ఏర్పడిన తర్వాత సిఫారసులు రూపొందించడానికి సుమారు 1 సంవత్సరం పడొచ్చు.
- నూతన జీతాల లెక్కలు కమిషన్ నిర్ణయించే ఫిట్మెంట్ ఫాక్టర్ ఆధారంగా మారతాయి.
ఫిట్మెంట్ ఫాక్టర్ ఏమిటి?
- ఉద్యోగుల నూతన మినిమమ్ బేసిక్ జీతాన్ని నిర్ణయించేందుకు ఉపయోగించే సంఖ్య.
- 1.92, 2.08, 2.28, 2.57 వంటి వేరియంట్లు ఉన్నాయి.
- 2.57 ఫిట్మెంట్ ఫాక్టర్ అమలైతే, కేంద్ర ఉద్యోగుల జీతాలు భారీగా పెరుగుతాయి..
2.57 ఫిట్మెంట్ ఫాక్టర్ అమలైతే ఎంత జీతం పెరుగుతుంది?
- కనీస జీతం: ₹18,000 → ₹46,260
- గరిష్ఠ జీతం: ₹2,50,000 → ₹6,42,000
8వ పే కమిషన్ ఆలస్యం అయితే ఏమవుతుంది?
- జీత పెంపు ఆలస్యం అవ్వొచ్చు కానీ DA (డియర్నెస్ అలౌయెన్స్) పెంచుతూ వెళ్లే అవకాశం ఉంది.
- 8వ పే కమిషన్ అమలైన తర్వాత DA రీసెట్ అవుతుంది & కొత్త జీతం అమలవుతుంది.
ఈ సారి జీతాలు విపరీతంగా పెరగొచ్చని అంచనా… అందుకే 8వ పే కమిషన్ అప్డేట్ మిస్ అయితే నష్టమే.