ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్లు జోరుగా దూసుకుపోతున్నాయి. ఎక్కువ దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, అధిక మైలేజీని ఇచ్చే మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఎలక్ట్రిక్ టూ వీలర్ స్టార్టప్ కంపెనీ అయిన సింపుల్ ఎనర్జీ, సింపుల్ వన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 1,39,999 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు విడుదల చేసింది. కొత్త మోడల్ ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 181 కి.మీ వరకు ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది.