చాలా మందికి మ్యూచువల్ ఫండ్స్ అంటే తెలుసు, కానీ వాటిని అమ్మకుండా కోలేటరల్గా పెట్టి లోన్ తీసుకోవచ్చు అనే విషయం తెలియదు. “Loan Against Mutual Funds” (LAMF) అనే ఈ సిస్టమ్ ద్వారా మీ పెట్టుబడిని కదపకుండా కూడా డబ్బు అవసరమైనప్పుడు లోన్ తీసుకోవచ్చు.
మ్యూచువల్ ఫండ్స్‌పై లోన్ అంటే ఏమిటి?
ఈ లోన్ Secured Loan, అంటే మీ మ్యూచువల్ ఫండ్ యూనిట్లు తాకట్టు (Collateral) గా ఉంటాయి. బ్యాంక్ లేదా NBFCలు మీ పెట్టుబడి విలువ ఆధారంగా ఓ శాతం మేర లోన్ మంజూరు చేస్తాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. మీరు మీ పెట్టుబడిపై Returns పొందుతూనే ఉంటారు
ఇది ఎలా పనిచేస్తుంది?
- మీరు బ్యాంక్ లేదా NBFC వద్ద లోన్ అప్లై చేయాలి
- బ్యాంక్ మీ మ్యూచువల్ ఫండ్లకు లీన్ (Lien) హోదా ఇస్తుంది – అంటే మీరు వాటిని రిడీమ్ చేయలేరు
- ఇక్విటీ ఫండ్స్‌కు 50% వరకు, డెట్ ఫండ్స్‌కు 70-80% వరకు లోన్ వస్తుంది
- లోన్ మీ బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్ క్రెడిట్ అవుతుంది
- మీరు EMI లేదా లంప్ సమ్ పద్ధతిలో తిరిగి చెల్లించవచ్చు
- పూర్తిగా తిరిగి చెల్లించిన తర్వాత మీ ఫండ్స్‌పై మీకు పూర్తి హక్కు తిరిగి వస్తుంది
ఎలిజిబిలిటీ & అవసరమైన డాక్యుమెంట్స్
- భారతీయ పౌరుడై ఉండాలి
- మ్యూచువల్ ఫండ్స్ Demat రూపంలో ఉండాలి
- నిలకడైన ఆదాయం ఉండాలి
- జాయింట్ అకౌంట్స్ అయినా, అన్ని హోల్డర్లు అంగీకరించాలి
అవసరమైన డాక్యుమెంట్స్:
- PAN/Aadhaar/Voter ID
- ఆదాయ నిర్ధారణ పత్రాలు (Salary Slips, Bank Statements)
- మ్యూచువల్ ఫండ్ స్టేట్మెంట్
- లోన్ అప్లికేషన్ ఫారం
ఎంత వరకు లోన్ వస్తుంది?
- ఇక్విటీ ఫండ్స్ – 50% వరకూ (₹20 లక్షల విలువ ఉంటే ₹10 లక్షల వరకు లోన్)
- డెట్ ఫండ్స్ – 70-80% వరకూ (₹20 లక్షల విలువ ఉంటే ₹14-16 లక్షల వరకు లోన్)
ఇంట్రెస్ట్ రేట్లు
మ్యూచువల్ ఫండ్స్‌పై తీసుకునే లోన్‌కు 8% – 12% మధ్య వడ్డీ రేటు ఉంటుంది. డెట్ ఫండ్స్‌పై తక్కువ రేటు, ఇక్విటీ ఫండ్స్‌పై ఎక్కువ రేటు ఉండొచ్చు.
Related News
రిస్క్‌లు & పరిమితులు
- మార్కెట్ డౌన్ ఐతే? – మీ పెట్టుబడి విలువ తగ్గితే, లీన్డ్ యూనిట్ల విలువ తగ్గిపోతుంది, బ్యాంక్ మరిన్ని కోలేటరల్స్ అడగొచ్చు లేదా లోన్ పరిమాణం తగ్గించొచ్చు
- ఇంట్రెస్ట్ బరువు – టైమ్‌కి చెల్లించకపోతే జరిమానాలు పడొచ్చు
ఇప్పుడే ఆన్లైన్లో అప్లై చేయండి
- బ్యాంక్/ఫైనాన్స్ కంపెనీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ఓపెన్ చేయండి
- “Loan Against Mutual Funds” ఎంపిక చేసుకోండి
- మీ మ్యూచువల్ ఫండ్ వివరాలు ఎంటర్ చేయండి
- అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి
- అప్లికేషన్ సబ్మిట్ చేయండి – 24 గంటల్లో లోన్ మీ అకౌంట్లో.
మీ పెట్టుబడి అమ్ముకోకుండానే డబ్బు అవసరమైనప్పుడు లోన్ పొందే స్మార్ట్ ఐడియా ఇది
ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి – మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిగా ఉంటే డబ్బు అవసరమైనప్పుడు లిక్విడేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడే LAMF గురించి తెలుసుకోండి, మీ అవసరాలకు సరైన నిర్ణయం తీసుకోండి.