నేటి రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని పొదుపు చేసి మంచి రాబడిని ఇచ్చే చోట పెట్టుబడి పెట్టాలనుకుంటారు. అలాంటి వాళ్ల కోసం పోస్ట్ ఆఫీస్ RD (Recurring Deposit) స్కీమ్ అద్భుతమైన అవకాశం. ఈ స్కీమ్ ద్వారా చిన్న మొత్తంలో పొదుపు చేస్తూ భారీ మొత్తాన్ని అందుకోవచ్చు.
పోస్ట్ ఆఫీస్ RD స్కీమ్ విశేషాలు
- ఇన్వెస్ట్మెంట్ ప్రారంభం – కేవలం ₹100 నుండి ప్రారంభించవచ్చు
- పూర్తి కాలం – 5 సంవత్సరాలు
- రాబడి – 6.7% వార్షిక వడ్డీ
- మాక్సిమమ్ లిమిట్ – పెట్టుబడికి ఎలాంటి గరిష్ట పరిమితి లేదు
- అకౌంట్ ఓపెన్ చేయడం – దగ్గరలోని ఏదైనా పోస్టాఫీస్‌లో ఓపెన్ చేయవచ్చు
చిన్న పొదుపుతో లక్షల్లో సేవింగ్స్ ఎలా?
- రోజుకు ₹100 పొదుపు చేస్తే, నెలకి ₹3,000
- సంవత్సరానికి మొత్తం ₹36,000
- 5 ఏళ్లలో మీ మొత్తం పెట్టుబడి ₹1.80 లక్షలు
- 6.7% వడ్డీతో కలిపి మొత్తం రూ. 2,14,097 మీరు పొందవచ్చు
పిల్లల పేరుతో కూడా ఖాతా ఓపెన్ చేయొచ్చు..
- ఈ అకౌంట్‌ను మైనర్ పిల్లల పేరుతో కూడా ఓపెన్ చేయవచ్చు.
- ఫిక్స్డ్ పీరియడ్‌కి ముందు ఖాతా క్లోజ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
- అవసరం వస్తే లోన్ తీసుకునే అవకాశం కూడా ఉంది.
ఇంత మంచి ఛాన్స్ మిస్ అవుతారా?
చిన్న మొత్తాల్లో పొదుపు చేస్తూ పెద్ద మొత్తాన్ని పొందాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్… భవిష్యత్తుకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వడమే కాకుండా, మంచి వడ్డీ లాభాలను కూడా అందిస్తుంది. ఇప్పుడు RD స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బును సురక్షితంగా పెంచుకోండి.