రాష్ట్రంలో రోజురోజుకూ వేడి పెరిగిపోతోంది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో 41 నుండి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కంటే 4 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. పగటిపూట వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉన్నందున, అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలని వాతావరణ శాఖ సూచించింది. బయటకు వెళ్ళేటప్పుడు గొడుగు లేదా టోపీ ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకూడదని, కాటన్ దుస్తులు ధరించాలని వారు చెబుతున్నారు.
ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాల వివరాలు
ఆదిలాబాద్ 37.8
భద్రాచలం 38
హకీంపేట 38.8
దుండిగల్ 38
హన్మకొండ 37
హైదరాబాద్ 36.9
ఖమ్మం 37.4
మహబూబ్ నగర్ 38.8
నల్గొండ 34.5
నిజామాబాద్ 38.9
రామగుండం 37.8
పటాన్చెరు 36.2
రాజేంద్రనగర్ 37
హయత్ నగర్ 36