Inter question paper: ఈ రోజు కూడా ఇంటర్ ప్రశ్నపత్రాల్లో తప్పులు

తెలంగాణ ఇంటర్ పరీక్షల ప్రశ్నాపత్రాల్లో తప్పుల పరంపర కొనసాగుతోంది. నేడు కూడా రెండు పేపర్లలో కొన్ని ప్రశ్నలు తప్పుగా ఉన్నాయి. బోటనీ, మ్యాథ్స్ పేపర్లలో తప్పులు దొర్లాయని ఇంటర్ బోర్డు అధికారులు గుర్తించారు. బోటనీ ప్రశ్నలు 5, 7, మ్యాథ్స్ ప్రశ్న 4లలో కూడా చిన్న చిన్న తప్పులు కనిపించాయి. ఈ విషయాన్ని గుర్తించిన ఇంటర్ బోర్డు సిబ్బంది అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో తప్పుడు ప్రశ్నలను సరిచేయాలని క్షేత్ర స్థాయి అధికారులకు ఆదేశాలు అందాయి. అయితే నిన్న, అంతకు ముందు రోజు జరిగిన పరీక్షల ప్రశ్నాపత్రాల్లో కూడా తప్పులు దొర్లాయి. నిన్న జరిగిన ఇంగ్లీష్ ప్రశ్నాపత్రంలో తలెత్తిన తప్పు కారణంగా, ఆ ప్రశ్నకు ప్రయత్నించిన విద్యార్థులకు పూర్తి మార్కులు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. నిన్న కూడా మూడు పేపర్లలో తప్పులు దొర్లాయి. ప్రతిరోజూ ప్రశ్నాపత్రాల్లో తప్పులు దొర్లుతుండడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఇంటర్ బోర్డు అధికారుల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now