DCM:చరిత్ర సృష్టించిన టీమిండియా.. పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!!

2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత జట్టు నిలిచింది. నిన్న (ఆదివారం) దుబాయ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంతో భారత జట్టు ఆటగాళ్ల సంబరాలు మిన్నంటాయి. ఈ క్రమంలో టీమ్ ఇండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నందున అందరి నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే టీమ్ ఇండియా విజయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచినందుకు “టీమ్ ఇండియాకు అభినందనలు” అని ఆయన సోషల్ మీడియాలో అన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ టోర్నమెంట్ అంతటా టీమ్ ఇండియా ప్రదర్శనను ఆయన ప్రత్యేకంగా అభివర్ణించారు. అన్ని రంగాలలో నైపుణ్యాన్ని ప్రదర్శించినందుకు పవన్ కళ్యాణ్ టీమ్ ఇండియాను ప్రశంసించారు. టోర్నమెంట్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ గెలవడం జట్టు అంకితభావం, ప్రతిభకు నిదర్శనమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని డిప్యూటీ సీఎం పవన్ ఆకాంక్షించారు.