తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మూడు గంటల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. దీనితో, రాష్ట్ర ప్రజలు రాబోయే 3 గంటల పాటు బయటకు వెళ్లవద్దని, అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తాజా ఆదేశాల ప్రకారం.. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు ఎండలు విపరీతంగా ఉంటాయి. ఈ సమయంలో ప్రజలు బయటకు వెళ్లవద్దని ప్రభుత్వం సూచించింది.
అలాగే, వివిధ పనుల కోసం బయటకు వెళ్లిన వారు.. పుష్కలంగా నీరు త్రాగాలి, పండ్ల రసాలు తాగాలి, ఎండ వేడి నుండి తప్పించుకోవడానికి కాలానుగుణ పండ్లు తినాలని వైద్యులు చెప్పారు. ఇంతలో రాష్ట్రంలో గత మూడు రోజులుగా వింత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం దట్టమైన పొగమంచు ఏర్పడుతుండగా, అనేక ప్రాంతాలు డిసెంబర్ నెలలో చలిని ఎదుర్కొంటున్నాయి. అలాగే మధ్యాహ్నం నాటికి, ఎండ వేడిమితో మండిపోతున్నాయి. ఈ వింత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.