SLBC: సీఎం రేవంత్​రెడ్డి కీలక ప్రకటనఎస్ఎల్‌బీసీ ప్రమాద బాధితుడికి నష్టపరిహారం..!!

శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువ (SLBC) సొరంగంలో మరణించిన గురుప్రీత్ సింగ్ కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు. ఆదివారం గురుప్రీత్ సింగ్ మృతదేహం లభ్యమైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఆయన మృతి పట్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సీఎం రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు. ఇటీవల SLBC సొరంగంలో జరిగిన ప్రమాదంలో పంజాబ్‌కు చెందిన గురుప్రీత్ సింగ్ మృతదేహం ఆదివారం లభించింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

పంజాబ్‌కు చెందిన గురుప్రీత్ సింగ్ సొరంగంలో టన్నెల్ బోరింగ్ మెషిన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. ఆయన అమెరికాకు చెందిన రాబిన్సన్ కంపెనీలో ఉద్యోగి, TBM ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. ఈ ప్రమాదంలో గురుప్రీత్ సింగ్ మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గురుప్రీత్ సింగ్ కుటుంబానికి వారు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు. మృతదేహాన్ని పంజాబ్‌లోని వారి స్వగ్రామానికి కూడా పంపారు.