ఏసీ కొనాలనుకుంటే ఇప్పుడే కోనేయండి.. ముందు ముందు ధరలు ఆకాశాన్ని అంటేలా ..

వేసవి కాలం రావడంతో ఏసీల వాడకం ఊహించని స్థాయిలో పెరుగుతోంది. ప్రస్తుతం మధ్యతరగతి వారు కూడా ఇంట్లో ఏసీలను ఉపయోగిస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

మన దేశంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు కావడంతో, గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏసీలకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో అమ్మకాలు దాదాపు 50 శాతం పెరిగే అవకాశం ఉంది.

గత సంవత్సరం అమ్మకాల ఆధారంగా ఈ సంవత్సరం ప్రముఖ కంపెనీలు కూడా ఏసీలను ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. అయితే, ఏసీల తయారీకి అవసరమైన ముడి పదార్థాల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. విడిభాగాల లభ్యత తగ్గడం వల్ల ధరలు పెరుగుతున్నాయని సమాచారం అందుతోంది. ఏసీల తయారీ ఖర్చు గతంతో పోలిస్తే ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

కాబట్టి ఏసీల ధరలు రూ. 2000 నుండి రూ. 3000 వరకు పెరిగే అవకాశం ఉంది. ఏసీలు కొనే వారు ఖచ్చితంగా ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా ఏసీలు కొనాలనుకునే వారు వెంటనే వాటిని కొనుగోలు చేయడం మంచిదని చెప్పవచ్చు. సాధారణంగా ఏసీల ధరలు ఎక్కువగా ఉంటాయని తెలిసిందే. వాటి ధరలు పెరిగినా, ఆ ప్రభావం సామాన్యులపై పెద్దగా ఉండే అవకాశం లేదు.

ఏసీలు కొనే వారు 5 స్టార్ ఏసీలను కొనుగోలు చేయడం ద్వారా తమ విద్యుత్ బిల్లులను ఆదా చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఏసీలు కొనే వారు కొనుగోలు చేసే ముందు సమీక్షలను తనిఖీ చేయడం మంచిది. మీరు ఏసీలు కొంటే, మీ విద్యుత్ బిల్లులు ఊహించని విధంగా పెరిగే అవకాశం ఉంది. గది అవసరాలకు అనుగుణంగా ఏసీలను ఎంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు.