ఇందిరమ్మ ఇళ్లపై మీరు వేచి చూస్తున్న అప్డేట్.. మీకు ₹5 లక్షలు త్వరలో..

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇల్లు మంజూరు చేయాలని రేవంత్ సర్కార్ స్పష్టం చేసింది. తొలివిడతగా 71,480 మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ అనుమతులు ఇచ్చాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇంటికొరకు డబ్బు మంజూరు ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. బేస్మెంట్ పూర్తి చేసిన వారికి ఈ నెల 15 నాటికి ₹1 లక్ష వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. మొత్తం ₹715 కోట్లను కేటాయించి, దశలవారీగా మొత్తం ₹5 లక్షలు అందించనున్నారు.

ఇందిరమ్మ ఇల్లు కోసం ఎవరు అర్హులు?

  • తెలంగాణలో నివసించే పేద కుటుంబాలు
  • తమ పేరుపై ఎలాంటి ఇల్లు లేనివారు
  • రాష్ట్ర ప్రభుత్వం పెట్టే అర్హత లిస్టులో పేరు ఉన్నవారు

దరఖాస్తు చేసుకుంటే తర్వాత చేయాల్సింది:

  1.  ప్రభుత్వం ప్రకటించిన తేదీల్లో గ్రామ, మండల కార్యాలయాల్లో అప్లికేషన్ సమర్పించడం జరిగింది.
  2.  ఆధార్, రేషన్ కార్డు, నివాస ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాలి.
  3.  అర్హుల లిస్టును జిల్లా స్థాయిలో ప్రకటిస్తారు. వాటిని మిస్ అవ్వకుండా చెక్ చేసుకోవాలి.

ఇళ్ల మంజూరు వివరాలు ఎక్కడ చూడాలి?

  • ప్రభుత్వం విడుదల చేసే సాంక్షన్ లిస్ట్ స్థానిక కార్యాలయాల్లో, అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు
  • అర్హత లభించిన వారు వెంటనే నిర్మాణ అనుమతి తీసుకొని, నిర్మాణాన్ని ప్రారంభించుకోవచ్చు

నిధుల విడుదల ఎప్పుడు?

  • మొదటి విడత ₹1 లక్ష – మార్చి 15 లోగా ఖాతాల్లో జమ
  • దశల వారీగా మొత్తం ₹5 లక్షల సాయం అందించనున్న ప్రభుత్వం

ఇప్పటికే అప్లై చేసిన వారు సాంక్షన్ లిస్ట్ తనిఖీ చేసుకుని, త్వరగా నిర్మాణ పనులు ప్రారంభించండి. ఇంకా అప్లై చేయని వారు తర్వాతి విడత అవకాశాన్ని మిస్ చేసుకోకుండా అప్లై చేయండి.

Related News

(Disclaimer: అధికారిక సమాచారం కోసం సంబంధిత అధికారులను లేదా ప్రభుత్వ వెబ్‌సైట్‌ను సంప్రదించండి.)