TG ICET: TG ICET-2025 నోటిఫికేషన్ రిలీజ్.. దరఖాస్తులు ఎప్పటి నుంచంటే..?

తెలంగాణలో MBA, MCA కోర్సులలో ప్రవేశాలకు TG ICET-2025 నోటిఫికేషన్ ఈరోజు (మార్చి 6) విడుదలైంది. ఈ క్రమంలో అర్హత , ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 10 నుండి మే 3 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే SC, ST, వికలాంగుల దరఖాస్తు రుసుము రూ. 550గా, BC, జనరల్ విద్యార్థులకు రూ. 750. ఆ తర్వాత, ICET పరీక్షలు జూన్ 8, 9 తేదీలలో నిర్వహించబడతాయి. పూర్తి వివరాల కోసం, అధికారిక వెబ్‌సైట్ https://tgche.ac.in/ ని సందర్శించండి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

రూ. 250 జరిమానాతో మే 17 వరకు, రూ. 500 జరిమానాతో మే 26 వరకు అవకాశం ఇవ్వబడింది. ఆన్‌లైన్‌లో చేసిన దరఖాస్తులలో ఏవైనా తప్పులు ఉంటే, వాటిని మే 16 నుండి 20 వరకు సరిదిద్దుకోవచ్చు. ఈ ప్రక్రియలో ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించిన అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించబడుతుంది. ఈ పరీక్ష జూన్ 8, 9 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా 16 (CBT) ఆన్‌లైన్ పరీక్షా కేంద్రాలలో 4 షిఫ్టులలో నిర్వహించబడుతుంది. ఈ పరీక్షలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ,మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడతాయి. వీటికి సంబంధించిన ప్రాథమిక కీ జూన్ 21న విడుదల చేయబడుతుంది. ఈ ‘కీ’పై అభ్యంతరాలను జూన్ 22 నుండి 26 వరకు స్వీకరిస్తారు. ఫలితాలు జూలై 7న విడుదల చేయబడతాయి.