Baldness: చిన్న ఏజ్‌లోనే బట్టతల రావడానికి కారణాలు..నిపుణుల ఏం చెబుతున్నారు..

ఈరోజుల్లో చాలా మంది బట్టతల సమస్యను ఎదుర్కొంటున్నారు. పురుషులే కాదు.. మహిళలు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. జన్యువులు, హార్మోన్లు, ఒత్తిడి, మందులు, మానసిక సమస్యలు బట్టతలకి కారణాలు కావచ్చని నిపుణులు అంటున్నారు. టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ జుట్టు రాలడానికి దోహదం చేస్తుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ హార్మోన్ జుట్టును పొట్టిగా, బలహీనంగా చేస్తుంది. ఆధునిక కాలంలో ఎదుర్కొంటున్న ఒత్తిడి ఒత్తిడి కూడా జుట్టు రాలడానికి కారణమవుతుంది. మానసిక సమస్యలు కూడా పురుషులలో బట్టతలకి దారితీయవచ్చు. కొన్ని మందుల దుష్ప్రభావాల వల్ల కూడా బట్టతల వస్తుందని నిపుణులు అంటున్నారు. జీవనశైలిలో మార్పులు కూడా జుట్టు రాలడానికి ఒక కారణం కావచ్చు.

అయితే, కొంతమందికి చాలా చిన్న వయస్సులోనే బట్టతల వస్తుంది. ఇది ఇరవై సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి మాత్రమే జరుగుతుంది. కారణం గురించి నిపుణులు ఏమి చెబుతారో తెలుసుకుందాం.

Related News

బట్టతలకి ముందు లక్షణాలు కనిపిస్తే.. జుట్టు రాలడం పెరుగుతుంది. ఇది గుత్తులుగా, పాచెస్‌గా రాలిపోతుంది. జుట్టు రాలిపోయిన చోట చర్మం నునుపుగా అనిపిస్తుంది. అలాగే, వెంట్రుకల కుదుళ్లు కనిపించవు. దీనికి కారణాలు జన్యుపరమైన, పోషకాహార లోపం అని నిపుణులు అంటున్నారు.

బట్టతల రాకముందు, జుట్టు రాలిపోయిన ప్రదేశం దురదగా ఉంటుంది. కానీ మీరు సరైన ఆహారం తీసుకుంటే, మీరు బట్టతలని నివారించవచ్చు. ఫోలిక్ యాసిడ్, ఐరన్, విటమిన్లు, కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. అలాగే, తక్కువ నీరు తీసుకోవడం వల్ల కూడా జుట్టు రాలుతుందని నిపుణులు ఇటీవల వెల్లడించారు.