TGPSC:గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్..

రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టులకు నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ఫలితాల విడుదల కోసం అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్-1 ఉద్యోగాల గురించి తప్పుడు వార్తలను తీవ్రంగా ఖండించింది. ఈ ఉద్యోగ నియామక ప్రక్రియపై సోషల్ మీడియాలో వ్యాపిస్తోన్న తప్పుడు ప్రచారంపై TGPSC పోలీసులకు ఫిర్యాదు చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ నేపథ్యంలో గ్రూప్-1 ఫలితాలను అతి త్వరలో ప్రకటిస్తామని చెప్పబడింది. మార్కుల జాబితాను TGPSC అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/లో పోస్ట్ చేస్తామని పేర్కొన్నారు. గ్రూప్-1 అభ్యర్థుల లాగిన్‌లో పేపర్ వారీగా మార్కులను పోస్ట్ చేస్తామని వెల్లడించారు. గ్రూప్-1 నియామక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు TGPSC స్పష్టం చేసింది. ఎలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకున్నారు. సోషల్ మీడియాలో వ్యాపిస్తోన్న తప్పుడు ప్రచారాన్ని అభ్యర్థులు నమ్మవద్దని కోరారు.