స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసే వారి కోసం NSE (నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్) తాజాగా కీలక మార్పు తీసుకువచ్చింది. ఇప్పటివరకు నిఫ్టీ 50 ఫ్యూచర్స్ & ఆప్షన్స్ (F&O) కాంట్రాక్ట్స్ నెల చివరి గురువారం ఎక్స్‌పైర్ అవుతుండగా, ఇకపై చివరి సోమవారానికి మారింది.
ఎప్పటి నుండి ఈ మార్పు అమల్లోకి వస్తుంది?
NSE ప్రకారం, ఈ కొత్త రూల్ ఏప్రిల్ 4, 2025 నుండి అమలులోకి వస్తుంది. అంటే, అప్పటి నుండి మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్-యెర్లీ నిఫ్టీ 50 F&O కాంట్రాక్ట్స్ అన్నీ చివరి సోమవారానికి ఎక్స్‌పైర్ అవుతాయి.
ఇప్పటి వరకు ఎలా ఉండేది?
ఇప్పటివరకు, ప్రతి నెల చివరి గురువారం ఎక్స్‌పైరీ డేట్‌గా ఉండేది. ఆ రోజు సెలవు ఉంటే, ఒక రోజు ముందుగా ఎక్స్‌పైర్ అవుతుంది. కానీ ఇకపై గురువారం కాదు, సోమవారం.
ఏ కాంట్రాక్ట్స్ ప్రభావితమవుతాయి?
- నిఫ్టీ 50 మంత్లీ F&O కాంట్రాక్ట్స్
- క్వార్టర్లీ (3 నెలల) F&O కాంట్రాక్ట్స్
- హాఫ్-యెర్లీ (6 నెలల) F&O కాంట్రాక్ట్స్
F&O అంటే ఏమిటి?
ఫ్యూచర్స్ & ఆప్షన్స్ (F&O) కాంట్రాక్ట్స్ అనేవి స్టాక్స్, కమోడిటీస్ లేదా కరెన్సీ లాంటి అసెట్‌ల విలువ ఆధారంగా పనిచేసే డెరివేటివ్ కాంట్రాక్ట్స్. వీటి ద్వారా ఇన్వెస్టర్లు అసలు షేర్లు కొనకుండానే ట్రేడింగ్ చేయగలుగుతారు.
ట్రేడర్స్ ఏమి చేయాలి?
ఈ మార్పు ట్రేడింగ్ స్ట్రాటజీస్ & లిక్విడిటీపై ప్రభావం చూపనుంది. కాబట్టి, ఇకపై ఎక్స్‌పైరీ డేట్ సోమవారంగా మారినందుకు అనుగుణంగా ప్లానింగ్ చేసుకోవాలి.
నిఫ్టీ 50 ట్రేడింగ్ చేసే వారు ఇప్పుడు అప్డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్‌పైరీ మార్పు మిస్ అయితే లాస్ పడే ఛాన్స్ ఉంది.
ఈ కొత్త మార్పుపై మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.