ఏపీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో గృహనిర్మాణ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు భూమిని అందించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు 70,232 మంది ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నారని మంత్రి అననాని సత్య ప్రసాద్ వెల్లడించారు. ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయంగా రూ.4 లక్షలు అందజేయనున్నారు. లబ్ధిదారులుగా గుర్తించబడిన మహిళల పేర్లపై ఇళ్ల స్థలాలు కేటాయిస్తారు. ఏజెన్సీల ద్వారా ఇళ్ల నిర్మాణ పనులు చేపడతారు. ఇళ్ల పట్టాలు జారీ చేసిన రెండేళ్లలోపు నిర్మాణం పూర్తి చేయాలి. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే ఇళ్ల స్థలాలు లభిస్తాయని పేర్కొన్నారు. రేషన్ కార్డు ఉండి 5 ఎకరాల కంటే తక్కువ ఫ్లాట్ భూమి, 2.5 ఎకరాల కంటే తక్కువ మాగాణి భూమి ఉన్నవారు మాత్రమే అర్హులని వెల్లడించారు.
Ration card : ఏపీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ..

04
Mar