Inter Exams: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్..పరీక్షకు 1,2 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి..!!

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 5వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. దీంతో అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. తొలిసారిగా హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్‌లను ముద్రించారు. దీని సహాయంతో పరీక్షా కేంద్రం ఎక్కడ ఉందో సులభంగా తెలుసుకోవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

రాష్ట్రవ్యాప్తంగా 1532 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. 29,992 ఇన్విజిలేటర్లు, 72 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 124 సిట్టింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రశ్నాపత్రాలు, సమాధాన పత్రాలు ఇప్పటికే జిల్లా కేంద్రాలకు చేరుకున్నాయని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమన్వయంతో పరీక్షల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.

ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పరీక్షా కేంద్రాల్లో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఇంటర్ బోర్డు వెబ్‌సైట్ నుంచి విద్యార్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన అన్నారు. విద్యార్థులు ఉదయం 8.45 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కోరారు. 1 లేదా 2 నిమిషాలు ఆలస్యమైన వారిని కూడా అనుమతిస్తామని వారు తెలిపారు.

Related News

మార్చి 5 నుండి ప్రారంభమయ్యే జూనియర్ ఇంటర్ పరీక్షలు ఈ నెల 24న ముగుస్తాయి. సీనియర్ ఇంటర్ పరీక్షలు మార్చి 6 నుండి ప్రారంభమై ఈ నెల 25 వరకు జరుగుతాయి.