EPFO Employee Pension Scheme (EPS) ప్రకారం, ఒక ఉద్యోగి 10 ఏళ్లపాటు పని చేస్తే రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందే అర్హత ఉంటుంది. కానీ మీ ఉద్యోగం కోల్పోయి 2-3 ఏళ్ల పాటు కొత్త ఉద్యోగం దొరకకపోతే? ఆ సమయంలో మీ సర్వీస్ కాలాన్ని ఎలా లెక్కిస్తారు?
ఉద్యోగ విరామం ఎక్కువగా అయితే ఏమవుతుంది?
మీరు ఒక ఉద్యోగం వదిలిపెట్టి కొత్త ఉద్యోగం పొందడానికి ఎక్కువ సమయం పడితే కూడా, మీ సర్వీస్ కాలం రీసెట్ అవదు
- మీ UAN (Universal Account Number) మార్చకుండా అదే కొనసాగిస్తే, కొత్త ఉద్యోగంలో పాత సర్వీస్ పీరియడ్ కూడా లెక్కలోకి వస్తుంది.
- మధ్యలో గ్యాప్ ఉన్నా, పెన్షన్ అర్హత పొందడానికి అవసరమైన 10 ఏళ్ల ఉద్యోగ అనుభవాన్ని క్రమంగా కొనసాగించవచ్చు
ఉదాహరణతో అర్థం చేసుకుందాం
- ఒక ఉద్యోగం లో 5 ఏళ్లపాటు పని చేసి, తర్వాత ఉద్యోగం పోయిందని అనుకుందాం.
- కొత్త ఉద్యోగం వచ్చే వరకు 1 సంవత్సరం గ్యాప్ వచ్చింది.
- ఆ తర్వాత మరో 5 ఏళ్లు కొత్త ఉద్యోగంలో పని చేస్తే, మొత్తం సర్వీస్ 10 ఏళ్లుగా లెక్కిస్తారు
- అప్పుడు మీరు పెన్షన్ పొందే అర్హత పొందుతారు.
10 ఏళ్లు పూర్తి కాకపోతే?
- 10 ఏళ్లు పూర్తయ్యేంతవరకు పనిచేయకపోతే, మీరు పెన్షన్ అమౌంట్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు.
- అయితే దానిపై ఎలాంటి వడ్డీ రాదు.
- మీ చివరి జీతం, మొత్తం సర్వీస్ పీరియడ్ ఆధారంగా పెన్షన్ లెక్కించబడుతుంది.
* పెన్షన్ ఫార్ములా:
మంత్లీ పెన్షన్ = (పెన్షనబుల్ సాలరీ × పెన్షనబుల్ సర్వీస్) ÷ 70
Related News
ముఖ్యమైన విషయం ఏమిటంటే?
ఉద్యోగం మారినా, గ్యాప్ వచ్చినా UAN మార్చకూడదు. అలా చేస్తే మీ మొత్తం ఉద్యోగ అనుభవం లెక్కలోకి వస్తుంది & పెన్షన్ అర్హత కోల్పోకుండా సేవ్ అవుతారు
ఇప్పుడు UAN లింక్ చేయకపోతే, రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ మిస్ అవ్వాల్సిందే.సమయానికి జాగ్రత్త పడండి, మీ భవిష్యత్‌ను సురక్షితం చేసుకోండి.