సైనిక్ స్కూల్ తరహాలో పోలీస్ స్కూల్‌ను కూడా దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ బ్రోచర్, వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. స్కూల్ యూనిఫాం నమూనాలను రేవంత్ రెడ్డి పరిశీలించారు. విద్యా వ్యవస్థలో కొత్త ట్రెండ్‌ను అవలంబించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పోలీసు అమరవీరుల కుటుంబాల పిల్లలకు అడ్మిషన్లలో మొదటి ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీధర్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, సీనియర్ పోలీసు అధికారులు కే. శ్రీనివాస్ రెడ్డి, స్టీఫెన్ రవీంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
GOOD NEWS: తెలంగాణలో సైనిక్ స్కూల్ తరహాలో పోలీస్ స్కూల్

02
Mar