తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీ వాయిదా పడింది. మొదట మార్చి 1న లక్ష తెల్ల రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, తరువాత చాలా జిల్లాల్లో కార్డుల దరఖాస్తుల విచారణ పూర్తి కాకపోవడంతో పంపిణీని వాయిదా వేయాలని నిర్ణయించారు. మిగిలిన వారికి కాకుండా కొందరికి కార్డులు ఇస్తే సమస్యలు తలెత్తవచ్చనే అంచనాతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత దరఖాస్తుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతారు. ఈ నెల 8 నాటికి ఎన్నికల కోడ్ ముగుస్తుంది. ఆ తర్వాత దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగుతుందని సమాచారం.
RATION CARD: అలెర్ట్.. రేషన్ కార్డుల పంపిణీ వాయిదా..

01
Mar