Thalliki Vandanam: తల్లికి వందనం డేట్ ఫిక్స్.. బడ్జెట్ లో 9,407 కోట్లు కేటాయింపు!

ఏపీలో పాఠశాల విద్యను దేశంలోనే నెంబ‌ర్ వ‌న్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu గారి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించడం విప్లవాత్మకమైన నిర్ణయం. ఇది స్థానిక సంస్థలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమేగాక ఉపాధ్యాయులు, విద్యార్థులపై ఒత్తిడి తగ్గిస్తుంది. సూపర్ – 6 హామీల్లో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం పథకాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభించడానికి బడ్జెట్ లో నిధులు కేటాయించాం.

రాష్ట్రంలో 1 నుంచి 12వ తరగతివరకు చదువుకునే ప్రతివిద్యార్థికి ఈ పథకాన్ని వర్తింపజేస్తాం. ఈసారి బడ్జెట్ లో పాఠశాల విద్యకు రూ.31,805 కోట్లు, ఉన్నత విద్యకు రూ.2,506 కోట్లు వెరసి 34,311 కోట్లు (గత ఏడాది కంటే రూ.2076 కోట్లు అధికం) కేటాయించడం ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేయడంలో మా చిత్తశుద్ధికి అద్దం పడుతోంది.

Related News

రానున్న ఐదేళ్లలో ఏపీ మోడల్ విద్యావ్యవస్థను తీసుకు రావాలన్న నా సంకల్పానికి బడ్జెట్లో తాజాగా కేటాయించిన నిధులు దన్నుగా నిలుస్తాయి. రాష్ట్రంలో నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం హర్షణీయం. దీంతో ఏపీ యువత అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆస్కారమేర్పడుతుంది.