Tongue: హాస్పిటల్ లో డాక్టర్ నాలుకని ఎందుకు చూస్తారో తెలుసా..?

మనం ఎప్పుడైనా అనారోగ్యంగా ఉంటే ఆసుపత్రికి వెళ్తాము. అయితే, వైద్యులు మొదట మన నాలుకను చూపించమని అడుగుతారు. ఈ పరీక్షకు చాలా కారణాలు ఉన్నాయి. ఇది రోగనిర్ధారణ పద్ధతి. నాలుకను చూసి మనకు ఎలాంటి సమస్య ఉందో వైద్యులు చెబుతారు. నాలుక రంగు, ఆకారం, పరిమాణం మన ఆరోగ్య స్థితి గురించి చెబుతాయి. డీహైడ్రేషన్ సమస్య ఉంటే నాలుక పొడిగా మారుతుంది. ఇది శరీరంలో నీటి కొరతను కూడా సూచిస్తుంది. రక్తహీనత సమస్య ఉంటే, నాలుక పాలిపోయి రక్తహీనతను సూచిస్తుంది. శరీరంలో ఇన్ఫెక్షన్లు ఉంటే, నాలుకపై తెల్లటి పొరలు ఏర్పడతాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

విటమిన్ లోపాలు
శరీరంలో B12 వంటి లోపం కనిపిస్తే, అది నాలుక రంగు, ఆకారాన్ని ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా.. ఆహారపు అలవాట్ల కారణంగా నాలుక రంగు మారుతుంది. అందుకే బయటి ఆహారాలు, జంక్ ఫుడ్స్ తినకపోవడమే మంచిది.

ధూమపానం
ధూమపానం నాలుక రంగును మారుస్తుంది. అంతే కాదు, ఊపిరితిత్తులను కూడా దెబ్బతీస్తుంది. మన దేశంలోని యువకులు కూడా ధూమపానం చేస్తున్నారు. ఈ అలవాటు తమ ప్రాణాలను కూడా తీస్తోందని వారికి తెలియదు. దీనివల్ల దంతాల రంగు కూడా మారుతుంది.

Related News

 

ఆరోగ్య సమస్యలు
థైరాయిడ్ సమస్యలు ఉంటే, నాలుక పెద్దదిగా మారుతుంది. అలాగే కాలేయం మూత్రపిండాల సమస్యలు ఉన్నవారి నాలుక రంగులో మార్పు వస్తుంది. నాలుకపై నల్ల మచ్చలు ఉంటే రక్తం రంగులో ఉన్న గడ్డలు క్యాన్సర్‌ను సూచిస్తాయి. నాలుక పరీక్ష అనేది త్వరిత, సులభమైన రోగనిర్ధారణ సాధనం. అయితే, వ్యాధిని నిర్ధారించడానికి అదనపు పరీక్షలు అవసరం కావచ్చు.