ఇటీవల నటుడు మాజీ వైఎస్సార్సీపీ నాయకుడు పోసాని మురళీ కృష్ణపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లిలో కులం పేరుతో ప్రజలను దూషించి, ప్రజల మధ్య వర్గ విభేదాలు సృష్టించారనే ఆరోపణలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు బుధవారం రాత్రి హైదరాబాద్లోని రాయదుర్గంలోని ఆయన ఇంట్లో పోసానిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఈరోజు ఉదయం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెకు తీసుకువచ్చారు. వైద్య పరీక్షల తర్వాత మధ్యాహ్నం రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పోసాని మురళీ కృష్ణ అరెస్టును ఖండించారు. ఈ మేరకు ఆయన స్వయంగా పోసాని భార్యకు ఫోన్ చేసి పరామర్శించారు. తరువాత రాబోయే రోజుల్లో వారి కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అదేవిధంగా పోసాని న్యాయవాది బాలా ఆయన అరెస్టుకు సంబంధించి పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. అరెస్టులో పోలీసులు సీనియర్ సిటిజన్ చట్టాన్ని పాటించలేదని ఆయన ఆరోపించారు. వారు చట్టవిరుద్ధంగా వ్యవహరించారని ఆయన అన్నారు. పోసాని అరెస్టు పూర్తిగా రాజకీయ ప్రతీకార చర్య అని న్యాయవాది బాలా అన్నారు.
YS Jagan: పోసాని మురళీకృష్ణ అరెస్ట్.. జగన్ కీలక వ్యాఖ్యలు!

27
Feb