రైలు ప్రయాణం చేస్తున్నారా? పొందండి 3% క్యాష్ బ్యాక్ ఆఫర్ ఈ విధంగా…

ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచడానికి దక్షిణ మధ్య రైల్వే (South Central Railway SCR) కొత్తగా UTS మొబైల్ యాప్ ద్వారా సాధారణ (Unreserved) టికెట్ కొనుగోలుపై 3% క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఇది నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంతో పాటు, ప్రయాణికులకు అదనపు ప్రయోజనం కలిగించేలా రూపొందించబడింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

UTS యాప్ ఎలా ఉపయోగపడుతుంది?

UTS యాప్ ద్వారా ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్ నుండే టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. ఇకపై స్టేషన్ల వద్ద టికెట్ కౌంటర్ల వద్ద గంటల కొద్దీ లైన్లలో నిలబడి టికెట్ కొనుగోలు చేసే అవసరం లేదు. మొబైల్‌లోనే టికెట్ బుక్ చేసుకుని, సురక్షితంగా, సులభంగా ప్రయాణం కొనసాగించవచ్చు.

R-వాలెట్ తో క్యాష్‌బ్యాక్

UTS యాప్‌లో R-వాలెట్ అనే ప్రత్యేక ఫీచర్ ఉంటుంది. ప్రయాణికులు ఈ వాలెట్‌లో గరిష్టంగా ₹20,000 వరకు డిపాజిట్ చేయవచ్చు. ఈ వాలెట్ ద్వారా టికెట్ కొనుగోలు చేస్తే 3% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అంటే, మీరు ₹100 విలువైన టికెట్ కొంటే, మీ అకౌంట్‌కి తిరిగి ₹3 జమ అవుతాయి. ₹200 విలువైన టికెట్ కొంటే, మీ అకౌంట్‌కి తిరిగి ₹6 జమ అవుతాయి. అదే విధంగా ₹500 విలువైన టికెట్ కొంటే, మీ అకౌంట్‌కి తిరిగి ₹15 జమ అవుతాయి.

Related News

ఈ ఆఫర్ చూడటానికి చిన్నగా అనిపిస్తున్న ఎక్కువ ప్రయాణం చేసేవారికి చాలా లాభదాయంగా ఉంటుంది. దీని ద్వారా ప్రతిరోజు ప్రయాణించేవారు చాలా లాభపడతారు. ఈ ఆఫర్ కేవలం డబ్బు ప్రయోజనం కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా అందిస్తుంది.

UTS యాప్ వినియోగ ప్రయోజనాలు

  • లైన్‌లో నిలబడాల్సిన అవసరం లేదు – సమయం ఆదా
  • నగదు లేకుండానే సులభంగా టికెట్ కొనుగోలు
  • బహుభాషా మద్దతుతో సులభ వినియోగం
  • Android, iOS, Windows ఫోన్లలో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
  • ప్రత్యేకంగా వెతకాల్సిన అవసరం లేకుండా ఎక్కడికైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు

ఇక మీ ప్రయాణాన్ని మరింత స్మార్ట్‌గా మార్చుకోండి! UTS యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, క్యాష్‌బ్యాక్‌తో టికెట్ బుకింగ్ చేసుకోండి. ఇదే అదనుగా ప్రయోజనం పొందండి.