ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్టు చేశారు.
బుధవారం రాయచోటి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయి.
పోసాని కృష్ణ మురళిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చురుగ్గా పనిచేసిన పోసాని ఇటీవల రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. అయితే, గతంలో ఆయన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు నాయకులను తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో, పలువురు టీడీపీ, జనసేన నాయకులు కూడా పోసానిపై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.
బుధవారం సాయంత్రం తర్వాత ఏపీ పోలీసులు పోసాని నివాసానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ రాత్రి ఆయనను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే, పోసానిని ఏ కేసులో అరెస్టు చేశారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.