కిసాన్ క్రెడిట్ కార్డు (KCC) అనేది రైతులకు తక్కువ వడ్డీకి, సమయానికి రుణం అందించేందుకు బ్యాంకులు అందించే ప్రత్యేక పథకం. దీని ద్వారా రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేయడమేకాక, పంట సాగు, పశుసంవర్ధకం, పాలఉత్పత్తి, చేపల పెంపకం వంటి అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలకు అవసరమైన నిధులను పొందవచ్చు.
KCC కింద లభించే రుణం ఎంత పెరిగిందో తెలుసా?
సమీప ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2014 మార్చిలో KCC కింద జమ అయిన మొత్తం రూ. 4.26 లక్షల కోట్లు ఉండగా, 2024 డిసెంబర్ నాటికి ఇది రూ. 10.05 లక్షల కోట్లకు పెరిగింది. అంటే రైతులకు మరింతగా సరసమైన రుణం లభించేలా వ్యవస్థ బలోపేతం అవుతోంది.
Related News
2019లో KCC విస్తరణ:
2019లో, కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని పశుసంవర్ధకం, పాల ఉత్పత్తి, చేపల పెంపకం వంటి వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా వర్తింపజేశారు. అంటే ఇప్పుడు కేవలం పంటల సాగుకే కాకుండా, రైతన్నకు పశుపోషణ, మత్స్య వ్యవసాయం వంటి వ్యాపారాలకు కూడా తక్కువ వడ్డీకే రుణం పొందే అవకాశం ఉంది.
తక్కువ వడ్డీకే రుణం – అదిరిపోయే సబ్సిడీ
- కేంద్ర ప్రభుత్వం మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ (MISS) కింద రైతులకు కేవలం 7% వడ్డీకే రూ. 3 లక్షల వరకు షార్ట్ టర్మ్ రుణం అందిస్తోంది.
- అదే టైం కి తిరిగి చెల్లించిన రైతులకు అదనంగా 3% వడ్డీ రాయితీ లభిస్తుంది, అంటే ఫైనల్ వడ్డీ రేటు కేవలం 4% మాత్రమే!
- రూ. 2 లక్షల లోపు రుణాలను బెయిలెస్ (కోల్యాటరల్ ఫ్రీ) గా అందిస్తారు, అంటే చిన్న, అంచనా రైతులు డబ్బుల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.
2025-26 బడ్జెట్లో కిసాన్ క్రెడిట్ కార్డు కోసం బంపర్ అప్డేట్
- KCC క్రెడిట్ లిమిట్ రూ. 3 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచారు.
- రైతులకు మరింత ఎక్కువ రుణం అందేలా బ్యాంకులపై ఒత్తిడి పెంచుతున్నారు.
- వ్యవసాయ రంగానికి 2025-26 బడ్జెట్లో రూ. 1,27,290 కోట్లు కేటాయించారు, ఇది 2013-14లో కేవలం రూ. 21,933.50 కోట్లు మాత్రమే ఉండేది. అంటే రెండింతల కంటే ఎక్కువ పెరుగుదల.
ఇప్పుడే మీ KCC అప్డేట్ చేసుకోండి. తక్కువ వడ్డీకి ఎక్కువ రుణం పొందండి.